Sunil Gavaskar : భార‌త బౌల‌ర్లపై స‌న్నీ కామెంట్స్

ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రాణిస్తారా

Sunil Gavaskar : మొహాలీలో జ‌రిగిన టి20 మ్యాచ్ లో ప‌ర్యాట‌క జ‌ట్టు ఆస్ట్రేలియా దుమ్ము రేపింది. భార‌త్ నిర్దేశించిన 208 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా సాధించింది. క్యామెరూన్ , మాథ్యూ వేడ్ భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

భువ‌నేశ్వ‌ర్ కుమార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్ , యుజ్వేంద్ర చాహ‌ల్ లు 40కి పైగా ప‌రుగులు ఇచ్చారు. ఇలా బౌలింగ్ చేస్తే భార‌త జ‌ట్టు వ‌చ్చే నెల‌లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎలా రాణిస్తారంటూ ప్ర‌శ్నించారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar).

చివ‌రి ఓవ‌ర్ లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ సైతం ఆశించిన మేర రాణించ లేద‌ని, ఆఖ‌రు ఓవ‌ర్ లో ధారాళంగా ర‌న్స్ ఇచ్చాడ‌ని మండిప‌డ్డారు.

మ్యాచ్ లో భాగంగా చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో 55 ర‌న్స్ చేయాల్సి ఉండింది ఆసిస్ కు. కానీ మాథ్యూ వేడ్ , టిమ్ డేవిడ్ ఇద్ద‌రూ డెత్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు.

తాము ఏదైతే అనుకున్నారో దానిని సుల‌భంగా ఛేదించార‌ని దీనికి ప్ర‌ధాన కార‌ణం బౌల‌ర్లేనంటూ మండిప‌డ్డారు. ఎంతో అనుభ‌వం క‌లిగిన భువీ ఇలా చేస్తాడ‌ని త‌ను అనుకోలేద‌ని పేర్కొన్నాడు స‌న్నీ(Sunil Gavaskar).

కీల‌క‌మైన ఓవ‌ర్ లో భువీ 16 ర‌న్స్ ఇచ్చాడు. చాహ‌ల్ త‌క్కువేమీ ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధానంగా ఈసారి భువీని టార్గెట్ చేశాడు గ‌వాస్క‌ర్. పాకిస్తాన్, శ్రీ‌లంక‌, ఆస్ట్రేలియాపై మొత్తం 49 ర‌న్స్ ఇచ్చాడ‌ని మండిప‌డ్డాడు.

Also Read : బౌల‌ర్ల నిర్వాకం వ‌ల్ల‌నే ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!