Punjab CM : రాజు శ్రీ‌వాస్త‌వ నుంచి చాలా నేర్చుకున్నా

భార‌తీయ క‌ళా రంగానికి విషాద‌క‌రం

Punjab CM : ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ గా పేరొందిన రాజు శ్రీ‌వాస్త‌వ ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ లో క‌న్ను మూశారు. దేశ వ్యాప్తంగా త‌న ప్ర‌తిభా పాటవాల‌తో ఆక‌ట్టుకున్నాడు.

58 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్ను మూశాడు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్ర‌ధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Punjab CM) సంతాపం వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధానంగా క‌మెడియ‌న్ గా గొప్ప గుర్తింపు పొందారు రాజు శ్రీ‌వాస్తవ‌. ఇదే స‌మ‌యంలో స్టాండప్ క‌మెడియ‌న్ గా రాజు శ్రీ‌వాస్త‌వ‌కు ప్ర‌స్తుతం పంజాబ్ సీఎంగా ఉన్న భ‌గ‌వంత్ మాన్ పోటీదారుగా ఉన్నారు.

ఇవాళ త‌ను లేక పోవ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను చూసిన గొప్ప న‌టుల్లో రాజు శ్రీ‌వాస్త‌వ ఒక‌డ‌ని కితాబు ఇచ్చాడు. భార‌తీయ క‌ళా రంగం గొప్ప వ్య‌క్తిని, న‌టుడిని కోల్పోయింద‌ని పేర్కొన్నాడు భ‌గ‌వంత్ మాన్(Punjab CM).

త‌న నుంచి తాను చాలా నేర్చుకున్నాన‌ని చెప్పాడు. ఎంత‌గానో న‌వ్వించారు. న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ వార్త నిజం కాక పోయి ఉంటే బావుండేద‌ని ఆ దేవుడిని కోరుకున్నా.

చాలా కాలం పాటు అత‌డితో క‌లిసి ప‌ని చేశా. చాలా బాధ క‌లుగుతోంద‌ని వాపోయాడు భ‌గ‌వంత్ మాన్. రాజు శ్రీ‌వాస్త‌వ మా మ‌ధ్య లేడు.

కానీ ఎల్ల‌ప్పుడూ మా హృద‌యాల‌లో స‌జీవంగా ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశాడు సీఎం. ఇదిలా ఉండ‌గా రాజు శ్రీ‌వాస్త‌వ‌, మాన్ ఇద్ద‌రూ మొద‌టి సీజన్ లో పాల్గొన్నారు.

Also Read : క‌మెడియ‌న్ కు సంతాపాల వెల్లువ‌

Leave A Reply

Your Email Id will not be published!