IIFL Hurun Rich List : హురున్ రిచ్ లిస్ట్ లో దివిస్ టాప్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నంబర్ 1
IIFL Hurun Rich List : ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్(IIFL Hurun Rich List) తాజాగా జాబితాను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో దివీస్ లేబొరేటరీస్ కంపెనీకి చెందిన మురళి టాప్ లో నిలిచారు.
భారతీయ రూపాయలలో 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన భారత దేశంలోని అత్యంత ధనవంతులను ప్రకటించింది.
ఇందులో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 78 మంది ధనవంతులు ఉన్నారు. రూ. 56,200 కోట్ల సంపదతో మురళి దివి అండ్ ఫ్యామిలీ ఆఫ్ దివీస్ లేబొరేటరీస్ ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇక రెండవ స్థానంలో రూ. 39,200 కోట్ల రూపాయల సంపదతో బి. పార్థ సారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ హెటెరో ల్యాబ్స్ నిలిచింది. మరో వైపు రూ. 8,700 కోట్ల రూపాయల సంపదతో ఏపీ, తెలంగాణ నుండి ఇద్దరు మహిళలు కూడా చోటు సంపాదించారు.
మహిమ దాట్ల కుటుంబం అత్యంత ధనిక మహిళగా నిలిచారు. ఈ ధనవంతుల జాబితాను ఈ ఏడాది 2022 ఆగస్టు 30 వరకు ప్రకటించంది ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్(IIFL Hurun Rich List) .
ఏపీ, తెలంగాణ జాబితాలోని వ్యక్తుల సంచిత సంపద గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. ఎంఎస్ఎన్ లేబొరేటరీస్, సింఘానియా ఫుడ్స్ ఇంటర్నేషనల్ , విర్చో లేబొరేటరీస్ తర్వాతి స్థానాలలో నిలిచాయి.
ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ రూ. 20,600 కోట్లు, సింఘానియా కంపెనీ రూ. 4,800 కోట్లు, విర్చో లేబొరేటరీస్ రూ. 5,300 కోట్లతో జాబితాలో నిలిచాయి.
ఇక రూ. 8,700 కోట్ల సంపదతో మహిమ దాట్ల కుటుంబం జాబితాలో ఉన్నారు. ఇక ధనవంతుల జాబితాలో 64 మంది హైదరాబాద్ కు చెందిన వారు కాగా 5 మంది విశాఖపట్నం , ముగ్గురు రంగారెడ్డికి చెందిన వారున్నారు.
Also Read : పీఎం కేర్స్ ట్రస్టీలుగా టాటా..థామస్..సుధా