PAK vs ENG 2nd T20 : చరిత్ర సృష్టించిన రిజ్వాన్..బాబర్ ఆజం
203 పరుగుల భాగస్వామ్యం
PAK vs ENG 2nd T20 : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న 2వ టి20 మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించారు.
బాబర్ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్ కు 203 పరుగులు చేశారు. ఏడు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇంగ్లండ్ , పాకిస్తాన్ చెరో మ్యాచ్
గెలుపొందారు. వీరిద్దరూ అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించారు.
ఇటీవల పాకిస్తాన్(PAK vs ENG 2nd T20) కెప్టెన్ బాబర్ ఆజం తీవ్ర ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డారు. యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో
ఆశించిన మేర రాణించ లేక పోయాడు.
తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా సత్తా చాటక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.
రాణిస్తే ఓకే లేదంటే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం తన కెప్టెన్సీని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చిరించాడు.
ఈ తరుణంలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న సీరీస్ లో ఆజం సూపర్ ఫామ్ లోకి రావడం విశేషం. ఇక టి20 ఫార్మాట్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం
పేరు మీద ఇప్పటి వరకు 197 పరుగల రికార్డు ఉండేది.
దానిని మహ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజం తిరగ రాశారు. ఇక పొట్టి ఫార్మాట్ లో ఏ వికెట్ కైనా ఇది ఐదో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
కెప్టెన్ బాబర్ ఆజం 66 బంతులు ఆడి 110 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక రిజ్వాన్ 51 బంతులు ఆడి 88 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉండగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తాము ఆడే మ్యాచ్ ల సందర్భంగా వచ్చే డబ్బులను పాకిస్తాన్ వరద బాధితులకు
ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
Also Read : కీవీస్ పై భారత్ – ఎ గ్రాండ్ విక్టరీ