Nitish Kumar Lalu : మేడంతో కలిసేందుకు ముహూర్తం ఫిక్స్
మహాకూటమి బలోపేతంపై నితీశ్ ఫోకస్
Nitish Kumar Lalu : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. భారతీయ జనతా పార్టీతో 17 ఏళ్ల బంధాన్ని ఆయన తెంచుకున్నారు.
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ , ఇతర పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ (మహాకూటమి) సర్కార్ ను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar Lalu) ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కలవనున్నారు.
ఇదే విషయాన్ని మీడియా సాక్షిగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తమిళనాడు నుంచి ప్రారంభించారు.
కేరళలో కొనసాగుతోంది. 2024లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ తన యాక్షన్ ను స్టార్ట్ చేసింది.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా మహా కూటమిని ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు నితీశ్ కుమార్. గతంలో ప్రయత్నాలు జరిగినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణ సర్కార్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు ద్రౌపది ముర్ము, జగదీప్ ధన్ ఖర్ గెలుపొందారు. ఇక విపక్షాలు బలపర్చిన యశ్వంత్ సిన్హా, మార్గరెట్ అల్వా ఓటమి పాలయ్యారు.
ఇదిలా ఉండగా దేశంలోని విపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పాటై బీజేపీని ఎదుర్కోవాలని నితీశ్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాహుల్ గాంధీని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారు.
పనిలో పనిగా సీపీఎం నేత సీతారాం ఏచూరితో మీట్ అయ్యారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ సోనియా గాంధీని కలవనున్నారు. ఇక జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
Also Read : భగవత్ రాహుల్ గాంధీతో కలిసి నడవండి