IND A vs NZ A 2nd ODI : కుల్దీప్ కమాల్ కీవీస్ ఢమాల్
ఇండియా-ఎ ఘన విజయం
IND A vs NZ A 2nd ODI : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సారథ్యంలోని ఇండియా -ఎ జట్టు(IND A vs NZ A 2nd ODI) ఘన విజయాన్ని నమోదు చేసింది. చెన్నై వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో సత్తా చాటింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు.
అంతే కాదు హ్యాట్రిక్ సాధించాడు. కీవీస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇండియా -ఎ కీవీస్ ను 2019 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్
లో గాన్ వాన్ బీక్ , జో వాకర్ , జాకబ్ డఫీల వికెట్లను పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయడంతో నాలుగో బంతికి పృథ్వీ షాకి క్యాచ్ ఇచ్చి లోగాన్ వాన్ బీక్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి బాల్ కు జో వాకర్ ను
బౌల్డ్ చేశాడు. వాకర్ క్యాచ్ ను కెప్టెన్ సంజూ శాంసన్ క్యాచ్ పట్టాడు.
చివరి బంతికి జాకబ్ డఫీకి లెగ్ బిఫోర్ వికెట్ గా పెవిలియన్ కు పంపించాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
కుల్దీప్ అద్భుతంగా ఆడినా టి20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేక పోయాడు.
ఇదిలా ఉండగా న్యూజిలాండ్ -ఎ తరపున రచిన్ రవీంద్ర 65 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. జో కార్డర్ 80 బంతులు ఆడి 72 రన్స్ చేశాడు.
2017లో కోల్ కతాలో ఆసిస్ పై కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు.
2019లో విండీస్ పై కూడా రికార్డు బద్దలు కొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు
మ్యాచ్ ల వన్డే సీరీస్ ను భారత – ఎ జట్టు(IND A vs NZ A 2nd ODI) 2-0 తేడాతో గెలుచుకుంది.
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ – ఎ టీం దుమ్ము రేపింది. 34 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి
222 రన్స్ చేసింది.
పృథ్వీ షా 48 బంతులు ఆడి 77 రన్స్ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 37 రన్స్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేశారు.
Also Read : వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు – దీప్తి శర్మ