Sadhguru Safari Comment : ‘స‌ద్గురు’కు చ‌ట్టం వ‌ర్తించదా

చ‌ట్టం ఎవ‌రికి చుట్టం

Sadhguru Safari Comment : ఆయ‌న జ‌గ‌మెరిగిన ఆధ్యాత్మిక వేత్త‌. నిత్యం ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడు కోవాల‌ని, ఈ ధ‌రిత్రిని ర‌క్షించు కోవాల‌ని బోధిస్తూ వుంటారు స‌ద్గురుగా పేరొందిన జ‌గ్గీ వాసుదేవ‌న్. ఆపై ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తారు. అంతే కాదు ఆయ‌న దేశంలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో టాప్ లో కొన‌సాగుతున్నారు.

యోగా పేరుతో , భ‌క్తి పేరుతో నిత్యం పాఠాలు వ‌ల్లెవేస్తారు. ఆయ‌న‌కు వివిధ దేశాల చీఫ్ లు, అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు, పారిశ్రామిక‌వేత్త‌లు, కార్పొరేట్ లు, వ్యాపార‌వేత్త‌లు, టెక్కీలు, ఆధ్యాత్మిక‌వేత్త‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడ‌వుతుంది.

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో అత్యంత ద‌గ్గ‌రి సంబంధం ఉంది. శివ‌రాత్రి సంద‌ర్భంగా స‌ద్గురు చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు న‌రేంద్ర మోదీ. దేశ ప్ర‌ధానితో స‌త్ సంబంధం క‌లిగిన స‌ద్గురు వ‌స్తున్నారంటే ప్రోటోకాల్ ఉంటుంది.

ఆపై ఆయ‌న‌కు స‌క‌ల రాచ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. ఆపై ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఎలాంటి చెకింగ్ లు ఉండ‌వు. సోదాలు జ‌ర‌గ‌వు. ఎందుకే ఆయ‌న దేశాన్ని ఉద్ద‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న యోగి.

ఇది ప‌క్క‌న పెడితే మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాక స్వాములు, యోగులు, ఆధ్యాత్మిక‌వేత్త‌ల‌కు ప్ర‌యారిటీ పెరిగింది. ఇది కాద‌న‌లేని స‌త్యం. ఇది

ప‌క్క‌న పెడితే తాజాగా ఆయ‌న కొత్త వివాదానికి తెర లేపారు.

ఏ ప‌ర్యావ‌ర‌ణం కోసమైతే కాపాడు కోవాలంటూ తాను ర్యాలీ చేప‌ట్టారో అదే స‌ద్గురు రూల్స్ కు వ్య‌తిరేకంగా పాల్ప‌డ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా

చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశాన్ని ఏలేటోడు మ‌నోడైతే చాలు ఇక పోలీస్, అధికార‌, న్యాయ వ్య‌వ‌స్థ‌లు సాగిల ప‌డాల్సిందే.

చెప్పింది చేయాల్సిందే. ఎందుకంటే అన్నిటికంటే ఈ దేశంలో రాజ‌దండం అత్యంత బ‌లీయ‌మైన‌మైది. రాజ్యాంగంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు అని

పేర్కొంటే సోకాల్డ్ మేధావులు, యోగులు, ఆధ్యాత్మిక గురువులు ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఆటాడుకుంటున్నారు.

ఇది ప‌క్క‌న పెడితే స‌ద్గురుకు తోడుగా అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ కూడా తోడ‌య్యారు. ఇంకేం జ‌గ్గీ వాసుదేవ‌న్ వాహ‌నం(Sadhguru Safari)

న‌డిపిస్తుంటే వెనుక సీటులో కూర్చుని రాత్రి పూట కాజిరంగా జాతీయ పార్కులో షికారు చేశారు.

ఇదీ స‌ద్గురు చేసిన నిర్వాకం. రాత్రిపూట ఎట్టి ప‌రిస్థితుల్లో సంద‌ర్శ‌న ఉండ‌ద‌ని, షికారు చేయ‌కూడ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీ చ‌ట్టం చెబుతోంది.

దీనిని గ‌మ‌నించిన సామాజిక , పర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌లు స‌ద్గురు, సీఎంపై ఫిర్యాదు కూడా చేశారు.

చీక‌టి ప‌డ్డాక స‌ఫారీ చేయ‌డం వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని వారంటున్నారు. పార్క్ లోని ఖ‌డ్గ మృగాలు, ఏనుగులు,

పులులు , ఇత‌ర జంతువుల‌కు ముప్పు వాటిల్లుతోందంటూ ప‌రిర‌క్ష‌కులు ఆరోపిస్తున్నారు.

కానీ సీఎం మాత్రం స‌ద్గురును వెన‌కేసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న ఏం చేయ‌గ‌ల‌రు ఖండించ‌డం త‌ప్ప‌. స‌ద్గురుపై కేసు న‌మోదైతే త‌న సీటు ఊడుతుంద‌ని ఆయ‌న‌కు తెలుసు.

స‌ద్గురు వెనుక ఉన్న‌ది ఎవ‌రు సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. స‌క్ర‌మ మార్గంలో జీవించాల‌ని హిత‌బోధ‌న‌లు చేసే జ‌గ్గీ వాసుదేవ‌న్ కు

చ‌ట్టం  వ‌ర్తించ‌దా అన్న‌ది ఇప్పుడు త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌.

అవును స‌ద్గురుపై కేసు న‌మోదు చేసే ద‌మ్ము ఎవ‌రికి ఉందని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సీఎం కాదు పీఎం స‌మాధానం చెప్పాలి. లేదంటే

స‌ద్గురు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి.

Also Read : నారాయ‌ణ రాణెకు సుప్రీంకోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!