Seshanna Comment : శేషన్న అరెస్ట్ తో కలకలం
మరో నయీంగా మారిన శేషన్న
Seshanna Comment : మరోసారి తెలంగాణ ఉలిక్కి పడ్డది. సకల నేరాలకు రాష్ట్రం కేరాఫ్ గా మారింది. దారుణ హత్యలకు , దందాలకు, దోపిడీలకు, బెదిరింపులకు పెట్టింది పేరు నయీం. ఆయన బతికి ఉన్నంత వరకు ప్రత్యర్థుల్లో వణుకు పుట్టింది. చివరకు మంత్రిని కూడా బెదిరించే స్థాయికి చేరుకోవడంతో పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు.
ఇక నయీం దందాల వెనుక కీలకమైన వ్యక్తిగా పేరుంది శేషన్నకు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరొందారు నయీమ్. ప్రధాన అనుచరుడిగా
ఉన్న శేషన్న గత కొంత కాలం నుంచీ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయుధాలు కొందరికి అమ్మినట్లు అనుమానించారు పోలీసులు.
దీంతో రంగంలోకి గింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ . హైదరాబాద్ లో ముగ్గురికి ఆయుధాలు అమ్మాడని వారిలో ఒకరిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన పక్కా సమాచారంతో శేషన్నపై(Seshanna) ఫోకస్ పెట్టారు. కొత్త పేటలోని ఓ హోటల్ కు వచ్చినట్లు కనుగొన్నారు. మాటు వేసి పట్టుకున్నారు.
అతడి వద్ద నుంచి 9 ఎంఎం తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 2018లో శేషన్నను పట్టుకుంటామని ప్రకటించారు డీజీపీ. ఈరోజు వరకు పోలీసులకు చిక్కకుండా ఉన్నాడు. తప్పించుకు తిరుగుతూ పోలీసులకు ఇబ్బందిగా మారాడు శేషన్న. ఇదే సమయంలో నయీమ్ కు ప్రధాన అనుచరుడిగా పేరొందారు.
ప్రధానంగా కుడి భుజంగా పని చేశాడు. అతడి ప్రతి కదలికలు, ఆస్తులు, అన్నీ శేషన్నకు బాగా తెలుసని ప్రచారం ఉంది. ఈమధ్యన భూముల
సెటిల్మెంట్లు కూడా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక దివంగత నయీమ్ అనుచరుల్లో ప్రధాన భాగం శేషన్న. అతడితో పాటు మరికొందరు కూడా ఉన్నారు.
వారిలో రామయ్య, జహంగీర్. షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ తర్వాత శేషన్నతో పాటు ఆ ఇద్దరు మాయమయ్యారు. కనిపించకుండా పోయారు. కానీ శేషన్న
కదలికలు మాత్రం ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు పోలీసులు. శేషన్నది ఉమ్మడి పాలమూరు జిల్లా. మావోయిస్ట్ పార్టీలో చేరాక నయీమ్ తో స్నేహం ఏర్పడింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్వంతంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పాలమూరు ఇలా విస్తరించుకుంటూ పోయారు
ఇద్దరూ. ఎక్కడ చూసినా వీరి పేర్లే వినిపించాయి. బెదిరింపులు, కిడ్నాప్ లు, వసూళ్లు , దందాలు ఇలా చేసుకుంటూ పోయారు.
ఒకే అంటే సరి లేదంటే మటాష్ అనే స్థాయికి తమ గ్యాంగ్ ను విస్తరించారు. ఆనాడు నయీమ్ ఫిక్స్ చేస్తే దానిని తూచ తప్పకుండా అమలు
చేయడంలో శేషన్న వ్యవహరించే వాడని ప్రచారం ఉంది. మొత్తంగా నయీమ్ నేరమయ ప్రపంచానికి వాచ్ డాగ్ లాగా వ్యవహరించాడు.
ప్రధానంగా శేషన్న తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వ్యాస్, పటోళ్ల హత్య కేసులో ప్రధాన నిందితుడు. పలు పీఎస్ లలో కేసులు ఉన్నాయి. ఇదే
క్రమంలో శేషన్న కోసం గాలింపు చేపట్టారు. కాగా అతడికి కర్నూలు జిల్లాలోని మాజీ మావోయిస్టు ఒకరు ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా నయీమ్ తో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవంటున్నారు డీజీపీ. ఇదిలా ఉండగా సిట్ ఏకంగా 197 కేసులు నమోదు చేయడం విశేషం. ఏది ఏమైనా శేషన్న అరెస్ట్ తో రాష్ట్రంలో మరోసారి కలకలం రేగుతోంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
Also Read : పాస్‌పోర్టు రెన్యూవల్ లో జాప్యం వద్దు