Nikhil Kamath : రిచ్ లిస్ట్ లో నిఖిల్ కామత్ నెంబర్ వన్
హురున్ ఇండియా 40 జాబితాలో చోటు
Nikhil Kamath : బెంగళూరుకు చెందిన నిఖిల్ కామత్ అరుదైన ఘనత సాధించాడు. జెరోధా కంపెనీని స్థాపించాడు. సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 40 ని ప్రకటించింది హురున్ ఇండియా. నిఖిల్ కామత్ జాబితాలో టాప్ లో నిలిచాడు.
భారత దేశానికి చెందిన 40 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు కలిగిన వారిని ఎంపిక చేసింది ఐఐఎఫ్ఎల్ కు సంబంధించి ప్రకటించిన లిస్టులో కోట్ల సంపదతో మనోడు చోటు దక్కించుకున్నాడు.
బెంగళూరుకు చెందిన జెరోధా కంపెనీకి చెందిన నిఖిల్ కామత్(Nikhil Kamath) వయసు 36 ఏళ్లు. రూ. 17,500 కోట్ల నికర విలువతో 2022లో టాప్ లో నిలిచాడు. ఇక స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు 37 ఏళ్ల నేహా నార్ఖేడే భారత దేశంలో అత్యంత పిన్న వయస్సు కలిగిన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు.
19 ఏళ్ల వయసులో జెప్టో కు చెందిన కైవల్య వోహ్రా జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగిన స్వీయ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ బిజినెస్ మెన్ గా పేరొందిన ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ రూ. 11,700 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక మీడియా డాట్ నెట్ కు చెందిన దివ్యాంక్ తురాఖియా మూడో స్థానంలో నిలిచాడు. అతడి నికర సంపద రూ. 11,200 కోట్లు. 30 ఆగస్టు 2022 నాటికి వరల్డ్ వైడ్ గా 53 మందిని ఎంపిక చేసింది. వారిలో 47 మంది భారత దేశంలో నివసిస్తున్నారు.
సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అత్యధిక సంఖ్యలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో 40 ఏళ్ల లోపు ఉన్నారు.
Also Read : బెంగళూరులో రిలయన్స్ లైఫ్ స్టైల్ స్టోర్