TMC MLA Arrest : బెంగాల్ జాబ్స్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్
TMC MLA Arrest : పశ్చిమ బెంగాల్ టీచర్ల భర్తీ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇప్పటికే మంత్రితో పాటు ఆయన సహచరురాలిని అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. తాజాగా ఇదే స్కాంకు సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యేను(TMC MLA Arrest) అదుపులోకి తీసుకుంది.
మూకుమ్మడి దాడుల్లో ఏకంగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. 5 కేజీల బంగారం కూడా బట్టబయలు అయ్యింది. దీంతో పార్టీలో, కేబినెట్ లో కీలకంగా ఉంటూ వచ్చిన పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను అరెస్ట్ చేసింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా అరెస్ట్ అయిన కొన్ని నెలల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య అరెస్ట్ కావడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి మంత్రి తర్వాత రెండో అరెస్ట్ ఇది. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
విచారణలో భాగంగా కీలకమైన సమాచారం లభించింది ఈడీకి. అరెస్ట్ అయిన మంత్రి పార్థ చటర్జీ వాట్సాప్ లో చోటు చేసుకున్న సంభాషణలు , ఇతర వివరాలను పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు చాట్ హిస్టరీలో లంచాలు వసూలు చేయడంలో ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ప్రేమయం ఉన్నట్లు గుర్తించింది.
దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా తప్పు పట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించింది.
Also Read : సమిష్టి నాయకత్వం పార్టీకి అవసరం – ఖర్గే