KT Ramarao : వాళ్లు కోవ‌ర్టు రెడ్లు – కేటీఆర్ సెటైర్

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై ఆగ్ర‌హం

KT Ramarao : వాళ్ల‌కు ఉన్న ఇంటి పేరు కోమ‌టిరెడ్లు కాదు కోవ‌ర్టు రెడ్లు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్(KTR) . కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో మునుగోడ‌లో ఉప ఎన్నిక మ‌రింత వేడిని రాజేస్తోంది. త్రిముఖ పోరు కొన‌సాగుతోంది.

ఇక్క‌డ బీజేపీ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వింతి రెడ్డి, టీఆర్ఎస నుంచి ప్ర‌భాక‌ర్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయా పార్టీలు విస్తృతంగా ప్ర‌చారంలో మునిగి పోయాయి. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు కేటీఆర్.

ఆయ‌న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ను టార్గెట్ చేశారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డ అభ్య‌ర్థి కేవ‌లం కాంట్రాక్టు కోసమే పార్టీ మారారంటూ మండిప‌డ్డారు. కేవలం కాంట్రాక్టుల కోసం బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ‌గోపాల్ రెడ్డికి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

తాము గెలుస్తామ‌ని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కూడా రావ‌ని జోష్యం చెప్పారు కేటీఆర్(KT Ramarao) . కేవ‌లం కాంట్రాక్టు కోసం , అహంకారంతో రాజీనామా చేయ‌డం వ‌ల్ల‌నే ఇవాళ ఉప ఎన్నిక జ‌రుగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీని వీడిన చ‌రిత్ర రాజ‌గోపాల్ రెడ్డిద‌ని మండిప‌డ్డారు.

త్వ‌ర‌లోనే ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. పూట‌కో పార్టీలు మార్చే వీరికి త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు మంత్రి. ప్ర‌జ‌ల‌ను వెర్రి వాళ్లు అనుకుంటే జాగ్ర‌త్త అని హెచ్చ‌రించారు.

Also Read : దేశ భ‌ద్ర‌త‌కు పెను స‌వాల్ – స్వ‌ప‌న్ దాస్

Leave A Reply

Your Email Id will not be published!