PM Modi : పుణ్య స్థలాలను నిర్లక్ష్యం చేశారు – మోదీ
నిప్పులు చెరిగిన ప్రధానమంత్రి
PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి గత ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా దేశంలోని దర్శనీయ, ప్రార్థనా, పూజా స్థలాలు, దేవాలయాలను నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకనే వాటికి పూర్వ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని మోదీ చెప్పారు.
ప్రార్థనా స్థలాలపై ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి , నిరాదరణకు గురి కాడానికి బానిస మనస్తత్వమే కారణమని మండిపడ్డారు ప్రధాన మంత్రి. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకు వస్తున్నామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని ప్రసిద్దమైన కేదార్ నాథ్ , బద్రీనాథ్ ఆలయాల్లో ప్రధాన మంత్రి ప్రార్థనలు చేశారు.
గత ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా విశ్వాస కేంద్రాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశాయంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటికి కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు మోదీ. కాశీ విశ్వనాథ ఆలయం, ఉజ్జయిని , అయోధ్య లో ఇటీవలి సంవత్సరాలలో భారీగా పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు.
ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురి కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా రెండు రోప్ వేలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఉత్తరాఖండ్ లోని ఘనా లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. మన వారసత్వం , అభివృద్దికి సాధ్యమయ్యే ప్రతి ప్రయత్నం 21వ శతాబ్దానికి పునాది అని పేర్కొన్నారు.
Also Read : దాన సంపన్నులు శివ నాడర్..ప్రేమ్ జీ