Rahul Gandhi : స్వామి ఆశీర్వాదం రాహుల్ సంతోషం
మంత్రాలయాన్ని దర్శించుకున్న అగ్ర నేత
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి అపూర్వమైన రీతిలో ఆదరణ చూరగొంటోంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్రలో యువ నాయకుడికి అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తి కాగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రసిద్దమైన పుణ్య క్షేత్రంగా విలసిల్లుతూ వస్తోంది శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన మంత్రాలయం. అంతకు ముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆదోనిలో మహదేవి లక్ష్మమ్మ అవ్వ సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర మంత్రాలయంకు చేరుకుంది.
అక్కడ మంత్రాలయం పీఠాధిపతి (మఠాధిపతి) శ్రీ సుబుదీంద్ర తీర్థుల స్వామి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా సుబుదీంద్ర తీర్థుల ఆశీర్వాదం తీసుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
గత కొంత కాలంగా రాహుల్ గాంధీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆయన బుద్దుడిని ఎక్కువగా ఫాలో అవుతూ వస్తున్నారు. ఈడీ విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ పెదవులపై చిరునవ్వు ఉండడాన్ని పోలీసులు పదే పదే ప్రశ్నించడంతో తాను విపశ్యన ధ్యానం చేస్తానంటూ వెల్లడించారు రాహుల్ గాంధీ.
మొత్తంగా రాహుల్ గాంధీ నాయకుడే కాదు అపర భక్తుడు అని నిరూపించుకున్నారు. ఇందిలా ఉండగా రాహుల్ గాంధీలో వచ్చిన ఈ మార్పులు చూసి పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : పుణ్య స్థలాలను నిర్లక్ష్యం చేశారు – మోదీ