Vivek Agnihotri : మస్క్ పై అగ్నిహోత్రి కామెంట్స్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఫ్లాగ్
Vivek Agnihotri : యావత్ ప్రపంచం ఒక్కసొరిగా కుదుపునకు లోనైంది. టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్నారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రూ. 4,400 కోట్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేయడం కలకలం రేపింది. ఎలాన్ మస్క్ పూర్తిగా ట్విట్టర్ నియంత్రణలోకి వెళ్లడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహొత్రి(Vivek Agnihotri) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక్ అగ్ని హోత్రి ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేతో సహా కొంత మంది వ్యక్తులు బ్రాహ్మణీయ పితృస్వామ్యాన్ని పగుల గొట్టండి అనే ప్లకార్డును పట్టుకుని ట్విట్టర్ నుంచి ఉద్వాసనకు గురైన లీగల్ హెడ్ విజయా గద్ద ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు.
మరో వైపు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిలియనీర్ ఎలోన్ మస్క్ అయినా లేదా ఇంకొకరైనా భారత దేశానికి సంబంధించి నియమ నిబంధనలు పాటించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఇందులో తాము రాజీపడే ప్రసక్తి లేదన్నారు. సత్యం సెన్సార్ చేయని చోట విషయాలు మారుతూ ఉంటాయని పేర్కొన్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
ఆయన కాశ్మీరీ పండిట్ల ఊచకోత, ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలంటూ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన పరివారం పిలుపునిచ్చారు. ఊహించని రేంజ్ లో కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ.
Also Read : కామెడీ ఇప్పుడు లీగల్ గా మారింది