Halloween Stampede : సియోల్ తొక్కిసలాటలో 151 మంది మృతి
మృతుల్లో 97 మంది మహిళలు 54 మంది పురుషులు
Halloween Stampede : దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని సియోల్ లోన హాలోవీన్ లో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 151 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అందిన సమాచారం మేరకు మొత్తం చని పోయిన వారిలో 97 మంది మహిళలు ఉండగా 54 మంది పురుషులు ఉన్నారు.
2020లో కరోనా మహమ్మారి ప్రారంభం అయ్యాక చోటు చేసుకున్న మృతుల సంఖ్య ఇది. దక్షిణ కొరియన్లు ఆరు బయట ఫేస్ మాస్క్ లు ధరించడం తప్పనిసరి కాదు. సియోల్ లోని ప్రముఖ మార్కెట్ లో హాలోవీన్ కోసం భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో భారీ ఎత్తున ఊపిరి ఆడక చని పోయారు(Halloween Stampede).
ఇప్పటి వరకు 151 మంది చని పోయినట్లు గుర్తించారు. ఈ తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక నివేదికల ప్రకారం లక్ష మంది ఒక్కసారిగా హాలోవీన్ కోసం బయలు దేరారు. దీంతో తీవ్రంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన సందులను మూసి వేసి వీధులను అడ్డుకున్నారు.
ఈ అనుకోని దుర్ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ చూసినా శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
Also Read : 150 మంది రైతులకు పంజాబ్ సత్కారం