Jack Dorsey : ట్విట్టర్ కు పోటీగా జాక్ డోర్సీ ‘బ్లూస్కీ’
ఆలోచిస్తామంటున్న మాజీ ఫౌండర్
Jack Dorsey : తాను ఏర్పాటు చేసిన ట్విట్టర్ ను టెస్లా సిఇఓ , చైర్మెన్ ఎలాన్ మస్క్ కైవసం చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పటికే తాను నియమించిన సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగల్ , లీగల్ హెడ్ విజయా గద్దెలను తొలగించారు మస్క్.
దీంతో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా మరొకటి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టేరకు ట్విట్టర్ కో ఫౌండర్ గా ఉన్న జాక్ డోర్సే గత వారం ట్విట్టర్ లో తన యాప్ బ్లూస్కీ సోషల్ మీడియా లేదా దానిని ఉపయోగించే వ్యక్తుల డేటా కోసం అంతర్లీనంగా ఫండమెంటల్స్ ను స్వంతం చేసుకునే ప్లాన్ లో ఉన్నారు.
ఏదైనా కంపెనీకి పోటీదారులుగా ఉండాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జాక్ డోర్సే గత ఏడాది 2021లో ట్విట్టర్ సిఇఓ పదవి నుంచి వైదొలిగాడు. మే 2022లో ట్విట్టర్ బోర్డు నుండి నిష్క్రమించాడు.
ఒక వేళ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను నియంత్రించడం పట్ల మీరు సంతోషంగా లేక పోతే మైక్రో బ్లాగింగ్ సైట్ కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నటయితే మీకో శుభవార్త. నిపుణుల అంచనా ప్రకరాం ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే(Jack Dorsey) కొత్త సోషల్ మీడియా అప్లికేషన్ ను బీటా టెస్టింగ్ కూడా చేస్తున్నారు.
ఓ వైపు ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కైవసం తీసుకున్నట్లు ప్రకటించిన వెంటనే బూస్కీని తీసుకు రానున్నట్లు పేర్కొన్నాడు.
Also Read : మస్క్ ట్విట్టర్ కైవసం ట్రంప్ సంతోషం