Poonam Kaur Rahul : పూన‌మ్ రాహుల్ చెట్టాప‌ట్టాల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Poonam Kaur Rahul : రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీని ర‌క్షించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు బార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు. 3,570కి పైగా సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేశారు. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి స్టార్ట్ అయి త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పాద‌యాత్ర పూర్త‌యింది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రాహుల్ గాంధీ యాత్ర కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ముఖ న‌టి పూన‌మ్ కౌర్ అనుకోకుండా ద‌ర్శ‌నం ఇచ్చారు జోడో యాత్ర‌లో. ఇదే క్ర‌మంలో పూన‌మ్ కౌర్ రాహుల్(Poonam Kaur Rahul)  ను క‌లుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా పూన‌మ్, రాహుల్ చేతులు క‌లిపి న‌డ‌వ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు భార‌తీయ జ‌న‌తా పార్టీ మహారాష్ట్ర నాయ‌కురాలు ప్రీతీ గాంధీ. ఆమె కీల‌క విమ‌ర్శ‌లు చేశారు. వారిద్ద‌రూ న‌డుస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇందుకు ఫోటో కింద క్యాప్ష‌న్ కూడా రాశారు. అదేమిటంటే రాహుల్ గాంధీ తాత‌కు త‌గ్గ మ‌నుమ‌డ‌ని నిరూపించుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

ఈ ఫోటో కాస్తా వైర‌ల్ గా మార‌డంతో ప‌లువురు తీవ్రంగా తప్పు ప‌ట్టారు. ప్రీతి గాంధీ చేసిన పోస్ట్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు పూన‌మ్ కౌర్. ప్ర‌తి దానిలో త‌ప్పుల్ని వెత‌క‌డం బీజేపీకి అల‌వాటేన‌ని ఆరోపించారు. ప్రీతి గాంధీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది మండిప‌డ్డారు.

Also Read : రేపిస్టులు..డేరా బాబాపై చ‌ర్యలు తీసుకోండి

Leave A Reply

Your Email Id will not be published!