#TataMotors : టాటా మోటార్స్ గుడ్ న్యూస్
రేటు తగ్గ ఫెసిలిటీస్
Tata Motors : కరోనా ఉన్నప్పటికీ ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ మాత్రం మెలమెల్లగా పుంజుకుంటోంది. మారుతీ మోటార్స్, టాటా మోటార్స్, హూంద్యాయ్, వోక్స్ వాగన్, మహీంద్రా, తదితర కంపెనీలన్నీ రోజు రోజుకు కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. ఇటీవల ఇండియాలో అత్యధిక అమ్ముడు పోయిన కార్లలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్ వెహికిల్ టాప్ ఒన్ లో నిలిచింది.
తాజాగా ఇండియాకు చెందిన టాటా మోటార్స్ కంపెనీ(Tata Motors) సఫారీ ఎస్ యూ పేరిట ఫ్లాగ్ షిప్ కారును ఆవిష్కరించింది. ఈ కార్లకు సంబంధించి ఆరు వేరియంట్లలో తీసుకు వచ్చింది. ఈ మోడల్స్ కార్లు కావాలనుకుంటే వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఇదే కంపెనీకి చెందిన ల్యాండ్ రోవర్, డీ8 ఆర్కిటెక్చర్ పై అంచనాలు బాగా పెంచుకుంది కంపెనీ.
భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టాటా సఫారీని రూపొందించారు. ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ ఏ ప్లస్ వేరియంట్లు ఆరు సీట్ల సామర్థ్యంతో తీర్చిదిద్దారు. మిగిలిన వేరియంట్లను ఏడు సీట్ల సామర్థ్యంతో కలిగేలా రూపొందించింది. 168 హార్స్ పవర్స్ సామర్థ్యం 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే రెండు లీడర్ల డీజిల్ ఇంజన్ ను అమర్చింది కంపెనీ.
వాహనదారులకు అత్యాధునిక సౌకర్యాలను వీటిలో అమర్చారు. ఇక లైటింగ్ సిస్టమ్(Tata Motors) అద్భుతంగా ఏర్పాటు చేశారు. అయితే సఫారీ మాత్రం ఎంతో ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది.మిగతా కంపెనీల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ తో రూపొందించారు సఫారీ ఎస్యూ వెహికిల్ ను.
No comment allowed please