TN Seshan Comment : సుప్రీం ‘శేషన్’ సెన్సేషన్
ఈ దేశానికి అలాంటి వ్యక్తి కావాలి
TN Seshan Comment : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఒకప్పుడు దేశ ప్రధాన ఎన్నికల అధికారిగా తనదైన ముద్ర కనబర్చిన దివంగత టీఎన్ శేషన్ గురించి మరోసారి ప్రస్తావనకు తీసుకు వచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యులను శేషన్(TN Seshan) లాంటి సమర్థవంతమైన అధికారులతో నియమించాల్సిన అవసరం ఉందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒక రకంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. అంతే కాదు నిలదీసింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నించింది.
ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా వినుతికెక్కిన భారత దేశానికి ఎన్నికలు నిర్వహించే సంస్థగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి గురుతరమైన బాధ్యత ఉందని పేర్కొంది. మరోసారి టీఎన్ శేషన్ ను పదే పదే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనేది ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలనే ఆలోచనను సుప్రీంకోర్టు ప్రతిపాదించంది.
మాజీ సీఇసీ దివంగత తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ లాంటి నిబద్దత కలిగిన ఉన్నతాధికారి లాంటి వారిని నియమించాలని అభిప్రాయ పడింది.
ఒక రకంగా కేంద్ర సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ధర్మాసనం. ఇంతకూ టీఎన్ శేషన్ ఎవరు. ఎందుకు సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం ప్రస్తావించాల్సి వచ్చిందో తెలుసు కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లను నిబద్దత కలిగిన వారిని ఎందుకు నియమించ కూడదని ప్రశ్నించింది.. అంతే కాదు ఒక బలమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రస్తుత తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎదుర్కొనే ధైర్యం ఉందా అని నిలదీసింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా డిసెంబర్ 12, 1990 నుండి డిసెంబర్ 11, 1996 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ పని చేశారు. ఆయన ఎన్నికల కమిషనర్ గా చుక్కలు చూపించారు. తన పవర్స్ ఏమిటో తెలియ చెప్పారు. ఓటుకు ఉన్న విలువ ఏమిటో ప్రజలను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయ్యారు టీఎన్ శేషన్(TN Seshan). ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ గా మిగిలి పోయారు.
విచారణ సమయంలో సీఈసికి గురుతరమైన బాధ్యత ఉందని పేర్కొంది. చాలా మంది ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. కానీ ఈ దేశానికి దివంగత సీఈసీ టీఎన్ శేషన్ లాంటి అధికారులు కావాలని స్పష్టం చేసింది ధర్మాసనం.
శేషన్ ఎందుకు సెన్సేషన్ అయ్యారంటే ఓటర్లకు లంచం ఇవ్వడం నేరమని ప్రకటించారు. మద్యం పంపిణీ, గోడలపై రాతలు రాయడాన్ని నిషేధించారు.
ఎన్నికల ప్రసంగాల్లో మతాన్ని ఉపయోగించరాదని హెచ్చరించారు. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశ పెట్టారు. ప్రవర్తనా నియమావళి, పోల్ ఖర్చులకు పరిమితిని అమలు చేశారు శేషన్. ఆనాటి పీఎం పీవీ శేషన్ తో పెట్టుకున్నారు.
గలీజుతో నిండిన ఎన్నికల సంఘాన్ని శుభ్రం చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకే సుప్రీంకోర్టు మరోసారి టీఎన్ శేషన్ ను, చేసిన సేవలను గుర్తు చేసింది. ఒక రకంగా సర్కార్ చెంప ఛెళ్లుమనించింది. అవును మనకూ శేషన్ లాంటి ఉన్నతాధికారి కావాలి.
Also Read : ఐటీ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ – సీజేఐ