Ramdev Baba : మహిళలూ తప్పైంది మన్నించండి – బాబా
అనుచిత కామెంట్స్ కు చింతిస్తున్నా
Ramdev Baba : ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు. అనుకోకుండా నోరు జారానని, ఇక తనను మన్నించమని వేడుకున్నారు. తనకు మాతృమూర్తులు అంటే గౌరవం ఉందని, కావాలని అనలేదని పేర్కొన్నారు. మహిళలు పుట్టుకతోనే అందంగా ఉంటారు.
ఆపై చీరల్లో, సల్వార్ కమీజుల్లో కూడా అద్భుతంగా ఉంటారన్న బాబా ఉన్నట్టుండి నోరు జారారు. ఆపై మహిళలు బట్టలు లేక పోయినా బాగుంటారని కితాబు ఇచ్చారు. ఆ తర్వాత తెలిసింది తనకు ఎంత అనుచితమైన వ్యాఖ్యలు చేశానని. ఆ వెంటనే రాం దేవ్ బాబా(Ramdev Baba)పై మహిళా లోకం భగ్గుమంది.
ఆయనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మేధావులు, మహిళలు, ఇతర రంగాలకు చెందిన వారంతా నిప్పులు చెరిగారు. సభ్య సమాజంలో కీలకమైన స్థానంలో ఉంటూ పది మందికి నీతి సూత్రాలు వల్లె వేసే రాం దేవ్ బాబా ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.
తాను బ్రహ్మచారినని చెబుతూ పతంజలి పేరుతో, యోగా పేరుతో వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్న బాబాకు మహిళలు బట్టలు లేకుండా ఉంటే ఎలా అందంగా ఉంటారో ఎలా తెలుసంటూ ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్నారు రాం దేవ్ బాబా(Ramdev Baba). వెంటనే మహిళా జాతికి క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు.
ఆపై టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ కోరారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాం దేవ్ బాబా కాళ్ల బేరానికి వచ్చాడు. తప్పైంది క్షమించమంటూ వేడుకున్నాడు. ఆ మేరకు ప్రకటన కూడా జారీ చేశాడు.
Also Read : ‘శానిటరీ ప్యాడ్స్’ పై కేంద్రానికి నోటీసులు