Sanitary Pads Supreme Court : ‘శానిట‌రీ ప్యాడ్స్’ పై కేంద్రానికి నోటీసులు

ఉచితంగా బాలిక‌ల‌కు ఇవ్వాల‌ని పిటిష‌న్

Sanitary Pads Supreme Court : ఈ దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతోంది. వ‌జ్రోత్స‌వాలు జ‌రుపుకుంటున్నాం ఘ‌నంగా. అయినా మ‌హిళ‌ల జీవితాల్లో మార్పులు రాలేదు. టెక్నాల‌జీ మారినా, త‌రాలు గ‌డిచినా ఇంకా వారి ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోంది. దేశంలో స‌గాని కంటే పైగా స్త్రీలు, యువ‌తులు, బాలిక‌లు ఉన్నారు.

ప్ర‌తి నెలా 50 ఏళ్ల వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా ప్ర‌తి నెలా వ‌చ్చే రుతు స‌మ‌స్య వారిని పీడిస్తోంది. వేధిస్తోంది. అనారోగ్యానికి గుర‌య్యేలా చేస్తోంది. దేశంలో ఎన్నో స్వ‌చ్చంధ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి.

ఆరోగ్యం, ప‌రిశుభ్ర‌త గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. కానీ 30 శాతానికి పైగా ఇంకా ప్ర‌తి నెలా వ‌చ్చే రుతుక్ర‌మం నుంచి గ‌ట్టెక్కేందుకు శానిట‌రీ ప్యాడ్స్(Sanitary Pads) వాడ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇవాళ శానిట‌రీ ప్యాడ్స్ స‌మ‌స్య భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానంకు వెళ్లింది. ప్ర‌త్యేకించి అప్పుడే య‌వ్వ‌నంలోకి అడుగు పెట్టిన బాలిక‌లు, యువ‌తుల‌కు శానిట‌రీ న్యాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖలైంది.

ప్ర‌ధానంగా దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 6 నుంచి 12వ త‌ర‌గ‌తి వర‌కు చ‌దువుతున్న బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ ప్యాడ్స్ ఇచ్చేలా కేంద్రాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించాల‌ని కోరుతూ పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈ మేర‌కు ప్రజా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం దాఖ‌లైంది.

సోమ‌వారం ఈ దావాపై సుప్రీంకోర్టు న్యాయ స్థానం(Supreme Court) విచార‌ణ చేప‌ట్టింది. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది ధ‌ర్మాస‌నం. వెంట‌నే స‌మాధానం ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన డాక్ట‌ర్ , సోష‌ల్ యాక్టివిస్ట్ జ‌య ఠాకూర్ ఈ పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్, జ‌స్టిస్ న‌ర‌సింహ‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కీల‌క నోటీసులు జారీ చేసింది.

Also Read : మాతో ఆడ‌క పోతే మీకే న‌ష్టం – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!