Eenadu Annadata Closed : అలుపెరుగని ‘అన్నదాత’కు సెలవు
రైతన్నలకు నేస్తంగా ఉన్న మాస పత్రిక
Eenadu Annadata Closed : దిగ్గజ వ్యాపారవేత్తనే కాదు మీడియా మొఘల్ గా పేరున్న రామోజీ రావు సారథ్యంలో నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన అన్నదాత మాస పత్రిక ఇక నుంచి నిలిచి పోనుంది. ఒక రకంగా వ్యవసాయదారులకు, రైతులకు, ఆ రంగం పట్ల మక్కువ కలిగిన వారికి ఇది చేదు కలిగించే వార్త. దాదాపు తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఈనాడు.
ఇదే సమయంలో రైతులకు సంబంధించి సమాచారం ఉండాలనే ఉద్దేశంతో అన్నదాత పత్రికను తీసుకు వచ్చారు రామాజీరావు. దాదాపు 52 ఏళ్లకు పైగా అన్నదాత అందరి ఆశీర్వాదం, సహాయ సహకారాలతో నడించింది. కానీ ఎప్పుడైతే డిజిటల్, సోషల్ మీడియా ఎంటరైందో ఆనాటి నుంచి పత్రికలకు రాను రాను కల్లు చెల్లుతోంది.
ఇప్పటికే ప్రసార మాధ్యమాలపై కూడా పెను ప్రభావం పడింది. ఇదిలా ఉండగా బుధవారం కీలక ప్రకటన చేశారు అన్నదాత సంపాదకులు అమిర్నేని హరికృష్ణ. ఇక వచ్చే నెల డిసెంబర్ నుంచి అన్నదాత పత్రిక(Eenadu Annadata) ప్రచురణ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మాస పత్రిక నిలిచి పోయినా సరే ఈటీవి ద్వారా సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని తెలిపారు.
కొన్నేళ్లుగా రైతులకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేశాం. సాగుదార్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 1969లో అన్నదాతను ప్రారంభించడం జరిగిందన్నారు. సాగుకు సంబంధించి ఖర్చు లు తగ్గించేందుకు ఉపాయాలు, ఉత్పత్తిని రెట్టింపు చేసేలా సమగ్రమైన , కచ్చితమైన సమాచారాన్ని ఇప్పటి వరకు అందజేస్తూ వచ్చామని తెలిపారు.
Also Read : అన్నదాతలకు జగనన్న తీపి కబురు