Amitabh Bachchan : హక్కులు..స్వేచ్చపై అమితాబ్ కామెంట్స్
కలకలం రేపుతున్న బిగ్ బి వ్యాఖ్యలు
Amitabh Bachchan : ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పుడు కూడా అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో పౌర హక్కులు , భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. సెన్సార్ షిప్ , భావ ప్రకటనా స్వేచ్చ గురించి ప్రస్తావించారు బిగ్ బి. నేటికీ సినిమా విషయానికి వస్తే భావ ప్రకటనా స్వేచ్ఛపై పలు రకంగాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆవేదన చెందారు.
ఎవరికి వారు తమంతకు తాముగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాటోగ్రాఫ్ చట్టం సెన్సార్ షిప్ నిర్మాణాన్ని ఇవాళ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు సమర్థించింది. కానీ ఇప్పుడు కూడా లేడిస్ అండ్ జెంటిల్మెన్ వేదికపై ఉన్న నా సహోదరులు అంగీకరిస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan).
పౌర హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతుండడం ఒక రకంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచం సాధారణమైంది. మనమంతా సంతోషంగా ఉన్నాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేని పోని ఆరోపణలతో విలువైన కాలాన్ని వ్యర్థం చేయవద్దంటూ సూచించారు బిగ్ బి.
మరో వైపు దీపికా పదుకొణే, షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై సర్వత్రా ప్రత్యేకించి హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బిగ్ బి మాట్లాడారని టాక్.
Also Read : పఠాన్ మూవీపై రామ్ కదమ్ ఫైర్