BCCI Hike : భారత క్రికెటర్లకు ఖుష్ కబర్
త్వరలో పెరగనున్న వేతనాలు
BCCI Hike : ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రీడా సంస్థగా పేరొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇటీవలే కొత్త కార్యవర్గం ఎన్నికైంది. గంగూలీ నిష్క్రమించాక కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్ గా ఎన్నికయ్యారు. రెండోసారి కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జే షా కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
ఎలాగూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా ఉన్నాడు. ఇక పోతే బీసీసీఐలో మొత్తం రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారే కొలువు తీరారు. ఒక్క బిన్నీ తప్పా. అందుకే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది బీసీసీఐ. ఈ తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.
వచ్చే ఏడాది 2023లో భారత్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇదే ఏడాది పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్న కారణంగా భారత్ వెళ్లడం లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేసింది.
దేశం కోసం సర్వ శక్తులు పెట్టి బాగా ఆడుతున్నారని భావించింది బీసీసీఐ. ఈ మేరకు క్రికెటర్లకు ఇప్పుడు ఇస్తున్న వేతనాల(BCCI Hike) కంటే మరికొంత పెంచాలని నిర్ణయించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లు పెద్ద ఎత్తున జీతాలు అందుకోనున్నారు. 10 నుంచి 20 శాతం పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ముంబైలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. వినోద్ రాయ్ నేతృత్వంలోని సివోఏ ఏ+ గ్రేడ్ ప్లేయర్లకు ప్రస్తుతం రూ. 7 కోట్లు చెల్లించింది. తాజాగా రూ. 10 కోట్లకు పెంచే అవకాశం ఉంది. గ్రేడ్ బి, సీ ప్లేయర్లకు రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు టాక్.
Also Read : మోదీ పనితీరు అద్భుతం – పీటీ ఉష