Bilkis Bano Comment : ఇదేనా న్యాయం తీర‌ని అన్యాయం

కోర్టు ఎటు వైపు ఉన్న‌ట్టు జ‌స్టిస్

Bilkis Bano Comment : ఈ దేశంలో రాను రాను న్యాయం కొంద‌రికే ప‌రిమితం కానున్న‌దా. లేక డ‌బ్బున్న మారాజుల వైపు నిలుస్తుందా అన్న అనుమానం నెల‌కొంటోంది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుద‌ల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

దానికి గ‌ల కార‌ణాలు ఏమిట‌నేది స్ప‌ష్టం చేయ‌లేదు. 2002లో జ‌రిగిన ఆ అమానవీయ ఘ‌ట‌న నేటికీ కెలుకుతూనే ఉంది. స‌మున్న‌త భార‌త దేశ చ‌రిత్ర‌లో అదో చీక‌టి అధ్యాయం.

కానీ ఆ దారుణానికి కొండ గుర్తుగా ఇప్ప‌టికీ నిలిచే ఉంది. స‌జీవంగా బ‌తికే ఉంది బిల్కిస్ బానో(Bilkis Bano). ఆమె ఓ మైనార్టీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. అన్నింటి కంటే స‌భ్య స‌మాజం త‌ల వంచుకునేలా, మ‌హిళా లోకం క‌న్నీటి ప‌ర్యంతం అయ్యేలా సామూహిక అత్యాచారానికి గురైంది. 

ఆనాటి ఘ‌ట‌న‌కు గురైన స‌మ‌యంలో బిల్కిస్ బానో వ‌య‌స్సు 21 ఏళ్లు. ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి కూడా. త‌న క‌ళ్ల ముందే 5 ఏళ్ల ప‌సి పాప‌తో పాటు కుటుంబీకుల‌ను హ‌త‌మార్చారు.

ఇది గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించిన కేసు క‌థ‌. ఈ దురాఘ‌తానికి పాల్ప‌డిన వారిని కోర్టు విచారించింది. మొత్తం 11 మందికి జీవిత ఖైదు విధించింది. కానీ కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం నిస్సిగ్గుగా బాధితురాలిని గాయం చేస్తూ అత్యాచారానికి పాల్ప‌డిన వారికి వ‌త్తాసు ప‌లికింది.

వారిలో మార్పు వ‌చ్చింద‌ని, స‌త్ ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు భూపేంద్ర ప‌టేల్ నేతృత్వంలోని గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆపై విడుద‌లైన దోషుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆపై వీర తిల‌కం దిద్దారు. అంతే కాదు కుటుంబీకులు స్వీట్లు పంపిణీ చేశారు.

ఇది పొద్ద‌స్త‌మానం భార‌త మాతాకీ జై అంటూ నినాదాలు వ‌ల్లించే శ్రేణులు సాధించిన ఘ‌న‌త‌. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది బిల్కిస్ బానో. విడుద‌లైన ఖైదీల నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వాపోయింది. ఆమెకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది.

ఎనిమిది వేల మందికి పైగా మ‌హిళ‌లు సంత‌కాల‌తో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దోషుల‌ను విడుద‌ల చేయ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని, మ‌హిళల‌ను అవ‌మానించిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా దోషుల విడుద‌లను స‌వాల్ చేస్తూ సాక్షాత్తు బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై విచార‌ణ జ‌రిపిన బెంచ్ లో జ‌స్టిస్ బేలా త్రివేది ఉన్న‌ట్టుండి త‌ప్పుకున్నారు. త‌ర్వాత జ‌రిగిన విచార‌ణ‌లో ఆమె దాఖ‌లు చేసిన రివ్యూ పిటిష‌న్ ను

కొట్టి వేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది.

ఈ నిర్ణ‌యం స‌భ్య స‌మాజాన్ని..ప్ర‌త్యేకించి స‌గానికి పైగా జ‌నాభా క‌లిగిన మహిళా లోకం విస్తు పోయింది. త‌న‌కు అన్యాయం జ‌రిగిందని వ‌చ్చిన ఏ వ్య‌క్తికి అన్యాయం జ‌ర‌గ కూడ‌ద‌ని న్యాయ దేవ‌త చెబుతుంది. రాజ్యాంగం కూడా ఇదే వ‌ల్లె వేస్తుంది. 

కానీ స్వ‌యంగా బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano) దోషుల నుంచి ప్రాణ హాని ఉందంటూ వేడుకున్నా న్యాయ‌స్థానం క‌నిక‌రించక పోవ‌డం దారుణం.

డియ‌ర్ జ‌స్టిస్ దేశంలో న్యాయం బ‌తికే ఉందా అన్న‌ది చెప్పాల్సింది..సుప్రీంకోర్టు కాదేమో ఇక కాల‌మే స‌మాధానం చెప్పాలేమో..క‌దూ.

Also Read : త్రిపుర‌, మేఘాల‌యలో మోదీ టూర్

Leave A Reply

Your Email Id will not be published!