#KalvakuntlaKavitha : గంగమ్మ కు ప్రణమిల్లిన కవితమ్మ
జీవితంలో మరిచి పోలేను
Kalvakuntla Kavitha : ఈ దేశంలోని ప్రతి ఒక్కరి కల గంగానదిలో పుణ్య స్నానం చేయాలని కోరిక. అలాంటి గంగమ్మ తల్లి ఒడిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం మొత్తం గంగా నది ని దర్శించుకుంది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లి విశేషాలను పంచుకుంది సీఎం కేసీఆర్ గారాల కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
పవిత్రమైన గంగానది ప్రశాంతత తనను, తమ కుటుంబీకులను మంత్ర ముగ్ధులను చేసిందని ఆమె తెలిపారు. సీఎం సతీమణి కల్వకుంట్ల శోభ, కవిత, కుటుంబ సభ్యులు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి అస్సీ ఘాట్ నుండి దశాశ్వ మేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణించారు
. గంగా నది బోటులో విహరిస్తూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. బెనారస్ ప్రజలతో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన సంభాషణ జరిగినట్లు కవిత ట్విటర్ ద్వారా తమ పర్యటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. దశాశ్వ మేధ ఘాట్ లో గంగానదికి హారతి ఇచ్చారు.
ఆ తర్వాత ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. గంగమ్మ ఒరవడి, ఆ ప్రశాంతమైన సన్నివేశం తనను ఎంతగానో ఆకట్టుకున్నదని కవిత పేర్కొన్నారు.
అంతే కాకుండా ఈ పర్యటన మొత్తం తన జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నారు. ఇదిలా ఉండగా కాశీ విశ్వనాథుని టూర్ విశేషాలకు సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్ గా మారాయి. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
No comment allowed please