#Orange : ఆరంజ్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు..

ఆరంజ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది.

Orange : సిట్రస్ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో ఆరంజ్ ఒకటి. ఆరంజ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సీజన్ లో వచ్చే జలుబు, జ్వరాలకు ఆరంజ్ దివ్యౌషధం. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఆరంజ్ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి, జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఆరెంజ్ ఫ్రూట్ లో కొల్లాజన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరంజ్ లో ఉండే ఫొలెట్, పొటాషియం, మెగ్నీషియం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయి.

ఆరంజ్ లో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరిచి కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. గర్భిణీ మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది లోపల ఉండే శిశువును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఆరంజ్ శరీరంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకుని షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు రాకుండా రక్షిస్తుంది.

No comment allowed please