IPL 2023 Auction : మినీ వేలంలో కోట్లు పలికేదెవరో
కీలక ఆటగాళ్ల పైనే ఫ్రాంచైజీల ఫోకస్
IPL 2023 Auction : వచ్చే ఏడాది 2023 లో భారత్ లో నిర్వహించే అతి పెద్ద టోర్నీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కోసం వేలం పాటకు సిద్దమైంది. ఈనెల 23న కేరళలోని కొచ్చిలో ఈ మినీ వేలం(IPL 2023 Auction) పాట జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ జట్లకు సంబంధించిన ఆడే ఆటగాళ్ల వివరాలతో పాటు వదిలేసిన ఆటగాళ్లను కూడా ఇచ్చేశాయి.
ఇక భారీ ఎత్తున వేలం పాటలోకి దరఖాస్తు చేసుకున్నా కేవలం 405 మందిని మాత్రమే ఎంపిక చేసింది బీసీసీఐ – ఐపీఎల్ ప్యానల్ కమిటీ. చాలా మంది ప్రధానమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొందరికి ఆడే ఛాన్స్ రాలేదు. మరికొందరిపై గతంలో భారీగా ఖర్చు చేసినా ఆశించిన మేర ఆడలేక పోయారు.
దీంతో తమకు బరువుగా ఉన్నారని వాళ్లను వదిలించుకున్నాయి. ఇక వేలం పాట చూస్తే బేస్ దర రూ. 2 కోట్ల లోపు ఉన్న వారిలో కీవీస్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ , రిలే రోసా, గ్రీన్ , హోల్డర్ , సామ్ కరన్ , బెన్ స్టోక్స్ , నికోలస్ పూరన్ , బాంటన్ , క్రిస్ జోర్డాన్ , ఆదిల్ రషీద్ , ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉన్నారు.
ఇక రాస్సీ వాన్ డెర్ డుసెన్ , నీషమ్ , క్రిస్టన్ , మైమిమల్ మిల్స్ , తదితర ఆటగాళ్లను తీసుకునే ఛాన్స్ ఉంది. వీరిలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారనేది చెప్పలేం.
మరో వైపు కోటిన్నర బేస్ ప్రైస్ లో ఉన్న ఆటగాళ్లను చూస్తే హ్యారీ, షకీబ్ ఉల్ హసన్ , రిచర్డ్ సన్ , ఆడమ్ జంపా, విల్ జాక్వెస్ , డేవిడ్ మలన్ , రూథర్ ఫోర్డ్ , రిలే మెరిడిత్ , జాసన్ రాయ్ , సీన్ అబాట్ , నైల్ కు ఛాన్స్ ఉంది.
కేవలం కోటి రూపాయల బేస్ ప్రైస్ (ప్రారంభ ధర) లో చాలా మంది అందుబాటులో ఉన్నారు. వీరిలో గతంలో మయాంక్ అగర్వాల్ ఆశించిన మేర రాణించ లేదు.
ఇక జో రూట్ , క్లాసెన్ , హుస్సేన్ , ముజీబ్ రెహమాన్ , తబ్రైజ్ షమ్సీ, మనీష్ పాండే, డారెల్ మిచెల్ ఉన్నారు. వీరితో పాటు మహ్మద్ నబీ, టాప్ లాథమ్ , షాయ్ హోప్ , బ్రాస్ వెల్ , ల్యూక్ వుడ్ , ఆండ్రూ టై, డేవిడ్ వైస్ , హెన్రీన్ , రోస్టన్ చేజ్ , కార్నెవాల్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆయా ఫ్రాంచైజీల పర్స్ లో ఎంతుందనే దానిపై ఆటగాళ్ల కొనుగోలు వ్యవహారం ఆధారపడి ఉంటుంది.
Also Read : ఐపీఎల్ వేలంలో ఆ ఆటగాళ్లకే డిమాండ్