Nee Valla O Pilla Song : ‘నీ వల్ల ఓ పిల్ల’ గుండె లోతుల్ల
మాయ చేసిన మట్ల తిరుపతి
Nee Valla O Pilla Song : జానపద సాహిత్యం ఇప్పుడు తన హవా కొనసాగిస్తున్నది. పల్లెతనపు లోగిళ్లను ఆవిష్కరిస్తోంది. ఒకటా రెండా వేలాది పాటలు గూగులమ్మ ఒడిలో సేద తీర్చేలా చేస్తున్నవి. అంతే కాదు యూట్యూబ్ పుణ్యమా అని గుండెల నిండా ప్రేమను ఒలక బోస్తున్నవి.
అమ్మతనపు లాలనను , ప్రేమతనపు లోగిళ్లను ఒకే చోట చేర్చేలా పాటలు మనస్సులను తాకుతున్నవి. పిల్లగాలుల పరిమళాలు చుట్టు ముట్టేలా అచ్చమైన మట్టి వాసనను పుణికి పుచ్చుకుంటూ లబ్ డబ్ మనేలా చేస్తున్నవి. ప్రకృతి, ప్రేమ రెండింటిని సమ పాళ్లల్లో మేళవించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను స్వంతం చేసుకున్న తెలంగాణ పోరడు మట్ల తిరుపతి.
ఇప్పటికే ఎన్నో పాటలు రాసిండు. అంతే కాదు తాను రాయడమే కాదు పాడటం కూడా చేసింది. మట్ల తిరుపతి రాసిన ఎన్నో పాటలు సామాజిక మాధ్యమాలను షేక్ చేశాయి. అంతే కాదు అతడికి ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ కవిని చేసింది. ఆకలి నేర్పిన పాఠం బతుకును వెలిగించేలా చేసింది.
మట్ల తిరుపతి కలం లోంచి , గొంతులోంచి జాలు వారింది మరో తియ్యనైన పాట. అదే నీ వల్ల ఓ పిల్ల(Nee Valla O Pilla Song) అనే పాట. ఇప్పుడు యువతీ యువకులనే కాదు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. తను ప్రాణప్రదంగా ప్రేమించే ప్రియురాలి కోసం ప్రియుడు ఆక్రోశిస్తూ పాడుకునే ఓ గేయమే ఇది. అనుపమా పరమేశ్వరన్ , నిఖిల్ కలిసి జంటగా నటించిన 18 పేజెస్ మూవీ లోనిది.
దర్శకుడు కూడా ఎక్కడా హద్దులు మీరకుండా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇక స్వర కర్త గోపీ సుందర్ మరోసారి తనదైన మార్క్ ను చూపించారు. చాలా హాయిగా , ప్రశాంతంగా నిద్ర పోయేలా దీనిని రాసి, పాడిన మట్ల తిరుపతిని, సంగీత దర్శకుడిని, దర్శకుడి అభిరుచిని అభినందించకుండా ఉండలేం.
అంతే కాదు దీనిని ఏరి కోరి సమర్పించిన అల్లు అరవింద్ కు హ్యాట్సాఫ్ చెప్పాలిందే..సుకుమార్ కు కూడా థ్యాంక్స్. ఇలాంటి పాటలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. మట్ల తిరుపతి లాంటి వర్ధమాన కళాకారులు, రచయితలు, కవులు, గేయ రచయితలు, గాయనీ గాయకులు ఎందరో ఉన్నారు. వారందరినీ ఉపయోగించు కోవాల్సిన అవసరం సినిమా రంగంపై ఉంది.
Also Read : అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవం