Messi Mbappe : లియోనెల్ మెస్సీ..మెబాప్పే వైర‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Messi Mbappe : ఖ‌తార్ లో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫ్రాన్స్ ను ఓడించి ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచింది మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా. పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించిన అర్జెంటీనాకు ఆ దేశంలో ఘ‌న స్వాగతం ల‌భించింది. అపూర్వ‌మైన రీతిలో అభిమానులు త‌మ జ‌ట్టుకు వెల్ క‌మ్ చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 టోర్నీలో భారీ ప్రైజ్ మ‌నీ ద‌క్కింది అర్జెంటీనాకు. ఆ జ‌ట్టు విశ్వ విజేత‌గా నిలిచినందుకు రూ. 347 కోట్లు ల‌భించాయి. ఫ్రాన్స్ ఆట‌గాళ్ల‌ను గోల్స్ చేయ‌కుండా అడ్డుకున్నందుకు గాను అర్జెంటీనా గోల్ కీప‌ర్ మెర్టినాజ్ కు బెస్ట్ గోల్ కీప‌ర్ అవార్డు ద‌క్కింది. గోల్డెన్ గోవ్ తో స‌త్క‌రించారు.

ఇక అత్య‌ధిక గోల్స్ తో త‌న జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చిన అర్జెంటీనా స్కిప్ప‌ర్ లియోనెల్ మెస్సీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు ద‌క్కింది. ఇక 1966 త‌ర్వాత ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో అర‌దైన ఘ‌న‌త‌ను సాధించాడు ఫ్రాన్స్ ఫుట్ బాల్ స్ట్రైక‌ర్ మెబాప్పే. హ్యాట్రిక్ సాధించి చ‌రిత్ర సృష్టించాడు.

అత‌డికి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ బూట్ ల‌భించింది. ఇదిలా ఉండ‌గా ఫైన‌ల్ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగింది. అయితే మెస్సీ, మెబాప్పే(Messi Mbappe) ఇద్ద‌రూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. మొత్తంగా మెస్సీ చిర‌కాల క‌ల నెర‌వేరింది. ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా హైలెట్ అయ్యారు.

వీరిపై మీమ్స్ కూడా పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. తాజాగా కేర‌ళ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఛాయ్ తాగుతూ ఉన్న‌ట్లు షేర్ చేసిన మెస్సీ, మెబాప్పే ఫోటో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : అర్జెంటీనా థిల్లానా భారీ న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!