Mallikarjun Kharge Slams : ఖ‌ర్గే కామెంట్స్ పై బీజేపీ క‌న్నెర్ర‌

స్వాతంత్రం కోసం పోరాడ‌ని వారంటూ ఫైర్

Mallikarjun Kharge Slams : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఈ మ‌ధ్య నోరు జారుతున్నారు. ఆయ‌న చేస్తున్న కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా మ‌రో వివాదానికి దారి తీశాయి. బీజేపీపై ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌ను బేష‌ర‌తుగా ఉప‌సంహ‌రించు కోవాల‌ని, వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

దీంతో పార్ల‌మెంట్ లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. తాను మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడ‌ని వాళ్లు ఇవాళ త‌మ‌కు నీతులు చెబితే ఎలా అంటూ నిల‌దీశారు. నన్ను క్ష‌మాప‌ణ చెప్ప‌మ‌ని అడిగే హ‌క్కు మీకు లేదంటూ స్పష్టం చేశారు. బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడిగా ఉన్న ఖ‌ర్గే(Mallikarjun Kharge) ఇలాంటి వ్యాఖ్యాలు మాట్లాడ‌టం దారుణ‌మంటూ బీజేపీ ఫైర్ అయ్యింది.

అధికార పార్టీకి చెందిన ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సారీ చెప్పేంత వ‌ర‌కు తాము ఊరుకోమ‌ని మండిప‌డ్డారు. దీంతో మంగ‌ళ‌వారం ఖ‌ర్గే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పైనే రాద్దాంతం చోటు చేసుకుంది. అయితే ఏఐసీసీ చీఫ్ సోమ‌వారం రాజ‌స్థాన్ ల‌ని అల్వార్ లో బీజేపీని శున‌కం అంటూ సంబోధించారు.

దీనిపై తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకుంది కాంగ్రెస్ , బీజేపీ స‌భ్యుల మ‌ధ్య‌. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన భార‌త్ జోడో యాత్ర‌ను బీజేపీ భార‌త్ తోడో అని ఎగతాళి చేసినందుకు పై విధంగా సీరియ‌స్ కామెంట్స్ చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ దేశం కోసం త‌మ ప్రాణాలు త్యాగం చేశార‌ని కానీ బీజేపీకి చెందిన వారు ఎంత మంది ఈ దేశం కోసం బ‌లిదానం చేసుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఖ‌ర్గే. బీజేపీ నేత‌లు బ‌య‌ట సింహాల్లా మాట్లాడ‌తారు కానీ లోప‌ల మాత్రం ఎలుక‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తారంటూ ఆరోపించారు.

Also Read : చిరు ధాన్యాల‌పై ప్ర‌చారం చేయండి

Leave A Reply

Your Email Id will not be published!