PAK vs ENG 3rd Test 2022 : పాక్ కు షాక్ ఇంగ్లండ్ క్లీన్ స్వీప్

స్వంత గ‌డ్డ‌పై కోల్పోయిన సీరీస్

PAK vs ENG 3rd Test 2022 : బాబ‌ర్ ఆజ‌మ్ సార‌థ్యంలోని పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. బెన్ స్టోక్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ దుమ్ము రేపింది. ఏకంగా మూడు టెస్టులు గెలుపొంది రికార్డు సృష్టించింది. క్లీన్ స్వీప్ చేసింది. 60 ఏళ్ల త‌ర్వాత ఘోర‌మైన ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. మూడు మ్యాచ్ ల‌లో విక్ట‌రీ సాధించి విస్తు పోయేలా చేసింది.

ఆఖ‌రి టెస్టులో ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. క‌రాచీ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 167 ర‌న్స్ నిర్దేశించింది. చివ‌రి రోజు మొద‌టి సెష‌న్ లోనే ఇంగ్లండ్(PAK vs ENG 3rd Test 2022) క్లియ‌ర్ చేసింది. మూడో టెస్టు మ్యాచ్ లో తొలిసారి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 304 ర‌న్స్ చేసింది.

అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 354 ప‌రుగులు చేయ‌డంతో 50 ర‌న్స్ ఆధిక్యంలో నిలిచింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ లో 216 ప‌రుగుల‌కు పాకిస్తాన్ ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సులువైన టార్గెట్ ను ఛేదించింది.

ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 35 ర‌న్స్ చేస్తే బెన్ డ‌కెట్ 82 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇక పాకిస్తాన్ అబ్రార్ అహ్మ‌ద్ చివ‌రి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉండ‌గా ముల్తాన్ లో జ‌రిగిన రెండో టెస్టులో 26 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

రావ‌ల్పిండిలో జ‌రిగిన తొలి టెస్టులో 74 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. దీంతో పాకిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేయ‌డం సంతోషం క‌లిగించేలా చేసింది.

Also Read : ఐపీఎల్ వేలంలో ఆ ఆట‌గాళ్ల‌కే డిమాండ్

Leave A Reply

Your Email Id will not be published!