Roger Binny Focus : బీసీసీఐపై రోజర్ బిన్నీ ఫోకస్
వివాదాలకు అందనంత దూరం
Roger Binny Focus : భారత దేశంలో అత్యంత అధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మీదే అందరి కళ్లు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీసీఐ బాస్ గా ఉన్న మాజీ భారత జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ వచ్చాడో బీసీసీఐ పేరు వరల్డ్ వైడ్ గా చర్చల్లో ఉంటూ వచ్చింది.
గంగూలీ మొదటి నుంచీ ఒకరి చేతి కింద పని చేసే రకం కాదు. తాను చెప్పినట్టు జరగాలని కోరుకోకునే మనస్తత్వం. అందుకే అతడికి బెంగాల్ టైగర్ అని పేరు వచ్చింది. కానీ కాలం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. బీసీసీఐ చీఫ్ గా మళ్లీ కావాలని కోరుకున్నాడు. కానీ అనూహ్యంగా ఆ పోస్ట్ లోకి రాలేక పోయాడు.
ఆపై ఐసీసీ చైర్మన్ రేసులో పేరు కూడా వచ్చింది. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నలలో బీసీసీఐ ఉంది. ఇది వాస్తవం. దానిని నమ్మలేం కూడా. ఆయన తనయుడు జే షానే ప్రస్తుతం బీసీసీఐని కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే గంగూలీ తప్పుకున్నాక కర్ణాటకకు చెందిన 1983 వరల్డ్ కప్ లో భాగమైన మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ చీఫ్ గా ఎంపికయ్యాడు.
గూంగూలీకి దూకుడు ఎక్కువ. మోస్ట్ ఎనర్జిటిక్ కాదు. చాలా సింపుల్ గా ఉంటాడు. సైలంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. కానీ ఎక్కడా ఎక్కువ బయట పడడు. బీసీసీఐ బాస్ గా ఎన్నికయ్యాక తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు రోజర్ బిన్నీ(Roger Binny Focus). కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఆటగాళ్ల వేతనాలు పెంచే యోచనలో ఉన్నాడు. దేశీవాళి క్రికెట్ లో ఆటగాళ్లు తప్పనిసరిగా ఆడాలని స్పష్టం చేశాడు. మెల మెల్లగా నిర్ణయాలు తీసుకుంటూ స్పష్టం చేస్తున్నాడు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఏది ఏమైనా గతంలో లేనంతగా బీసీసీఐ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ప్రధానంగా జట్టు ఎంపిక విషయం. ప్రధానంగా కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కు జరుగుతున్న అన్యాయం గురించి నోరు మెదపలేదు. ఇదే క్రమంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేశారు బీసీసీఐ బాస్. రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది.
సెలెక్షన్ కమిటీని కూడా ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంది. దమ్మున్న ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు కత్తి మీద సాముగా మారింది. మరి రోజర్ బిన్నీ జే షా రాజకీయాలను తట్టుకుని నిలబడతాడా లేక మౌనంగా ఉంటాడా అన్నది చూడాలి.
Also Read : మానని గాయం రోహిత్ శర్మ దూరం