TSPSC Jobs : నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నారు తప్ప ఇప్పటి దాకా ఒక్క పోస్టును భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 581 పోస్టుల భర్తీకి ఓకే చచెప్పింది. సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న వీటిని భర్తీ చేయనుంది.
ఆయా ఖాళీలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1 పోస్టులు 5 ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు(TSPSC Jobs ) 106 ఉన్నాయి. ఇవి కూడా గిరిజన సంక్షేమ శాఖలో ఉండడం విశేషం. ఎస్సీ డెవలప్ మెంట్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు 70 ఉన్నాయి. ఇవి మహిళలకు మాత్రమే కేటాయించారు. హాస్ల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు 228 ఉన్నాయి. ఇవి పురుషులకు కేటాయించారు.
బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు 140 ఉన్నాయి. వార్డెన్ గ్రేడ్ -1 పోస్టులు 5 ఉన్నాయి. ఇవి డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ శాఖలో ఉన్నాయి. మ్యాట్రన్ గ్రేడ్ -1 పోస్టులు(TSPSC Jobs ) ఇదే శాఖలో 3 ఖాళీలు ఉన్నాయి. మ్యాట్రన్ గ్రేడ్ -2 పోస్టులు ఇదే శాఖలో 2 ఉన్నాయి. ఇక లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ స్త్రీ , శిశు సంక్షే శాఖలో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ కలిగి ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనవర్చిన వారిని ఫైనల్ గా ఎంపిక చేస్తారు. జనవరి 6 నుంచి మొదలవుతుంది ఆన్ లైన్ లో జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు డెడ్ లైన్ విధించింది.
Also Read : కరోనా భూతం మాస్క్ లు అవసరం