Telangana Assembly : ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ
5న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్
Telangana Assembly : త్వరలో ముందస్తు ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటూ విపక్షాలు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. మరో వైపు పక్కనే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చుతుందా అన్నది తేలాల్సి ఉంది.
ఈ తరుణంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాక నిర్వహించిన బీఆర్ఎస్ భేరి సభ ఆశించిన స్థాయిలో జనం రాలేదని, కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందన్న విమర్శలు లేక పోలేదు. ఏది ఏమైనా వచ్చే నెల ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్.
ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ సీఎంగా మారింది. గత శాసనసభ సమావేశాల సందర్భంగా ముందస్తుగా గవర్నర్ ప్రసంగం లేకుండానే కానిచ్చేశారు. దానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయినా కేసీఆర్ డోంట్ కేర్ అన్నారు. ఆపై సమావేశాలు కూడా ముగిశాయి.
తాజాగా నిర్వహించే శాసనసభ సమావేశాలకు డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ను ఆహ్వానిస్తారా లేక ఎప్పటి లాగే అవమానిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. రాబోయే ఎన్నికలకు ముహూర్తం ఉండేలా, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, తాయిలాలు ఇచ్చేలా ఉంటుందని సమాచారం.
ఇందుకు సంబంధించి కొత్తగా కొలువు తీరిన సీఎస్ శాంతి కుమారి తో కలిసి కొత్త పద్దుతలపై సీఎం కేసీఆర్ కసరత్తు చేశారు. 3న మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇందుకు సంబంధించి ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు.
Also Read : ఆహ్వానమా లేక అవమానమా