ICC ODI Rankings : వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ టాప్

నెంబ‌ర్ 1 ప్లేస్ కోల్పోయిన కీవీస్

ICC ODI Rankings : నిన్న‌టి దాకా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతూ వ‌చ్చిన న్యూజిలాండ్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. భార‌త్ తో జ‌రుగుతున్న వ‌న్డే సీరీస్ లో రెండో వ‌న్డే మ్యాచ్ లో 108 ప‌రుగుల‌కే చాప చుట్టేయ‌డంతో ఉన్న‌ట్టుండి స్థానం కోల్పోయింది. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌న్డే ర్యాంకింగ్స్(ICC ODI Rankings) ప్ర‌క‌టించింది.

ఇంగ్లండ్ నెం. 1 స్థానానికి చేరుకుంది. ఇక రెండో స్థానంతో స‌రి పెట్టుకుంది న్యూజిలాండ్. కీవీస్ పై వ‌రుస‌గా గెలిచిన టీమిండియా మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఒక‌వేళ మూడో వ‌న్డేలో గెలిస్తే ఇంగ్లండ్ ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతానికి విచిత్రం ఏమిటంటే ఇంగ్లండ్ , న్యూజిలాండ్ , భార‌త్ 113 పాయింట్ల‌తో స‌మానంగా ఉన్నాయి.

కానీ మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా ఇంగ్లండ్ టాప్ లో నిలిచింది. వ‌న్డే మ్యాచ్ ఓడిపోక ముందు న్యూజిలాండ్ 115 రేటింగ్ తో నెంబ‌ర్ వ‌న్ గా ఉండేది. ఇంగ్లండ్ 113 పాయింట్లు, 112 పాయింట్ల‌తో ఆస్ట్రేలియా మూడో స్థానంలో , 111 పాయింట్ల‌తో భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగాయి. అయితే భార‌త్ తో జ‌రిగిన వన్డే సీరీస్ లో అనూహ్యంగా కీవీస్ ఓట‌మి పాలైంది.

దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో తేడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన రేటింగ్ ల‌లో ఇంగ్లండ్, కీవీస్, భార‌త్ త‌ర్వాత 112 పాయింట్లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో కొన‌సాగుతుండ‌గా పాకిస్తాన్ 106 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో శ్రీ‌లంక‌తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ లో 3-0 తేడాతో భార‌త్ దుమ్ము రేపింది.

Also Read : టీమిండియా సునాయ‌స విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!