IND vs NZ 3rd ODI : టీమిండియా జోరుకు కీవీస్ బ్రేక్ వేసేనా

ప‌ట్టు కోసం భార‌త్ ప‌రువు కోసం కీవీస్

IND vs NZ 3rd ODI : మూడు మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ ను కైవ‌సం చేసుకునేందుకు భార‌త్ ఉవ్విళ్లూరుతోంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి వ‌న్డేలో 12 ప‌రుగుల తేడాతో గెలిచిన టీమిండియా రాయ్ పూర్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలో 108 ప‌రుగుల‌కే ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ జ‌ట్టును క‌ట్ట‌డి చేసింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ రాణిస్తూ సీరీస్ పై క‌న్నేసింది.

మ‌రో వైపు న్యూజిలాండ్ జ‌ట్టు ఎలాగైనా స‌రే ప‌రువు పోకుండా కాపాడు కోవాల‌ని చూస్తోంది. కీల‌క‌మైన మూడో వ‌న్డేలో(IND vs NZ 3rd ODI)  స‌త్తా చాటాల‌ని డిసైడ్ అయ్యింది. దీంతో ఈ కీల‌క‌మైన మ్యాచ్ లో ఇరు జ‌ట్లు హోరా హోరీగా త‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది.

ఇక అన్ని విభాగాలలో స‌త్తా చాటుతున్న భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన మార్పులు ఏవీ ఉండ‌క పోవ‌చ్చ‌ని హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాడు.

ఎక్కువ‌గా ప్ర‌యోగాలు చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు. ఒక్క‌సారి ఫిక్స్ అయ్యాడంటే త‌ను చెప్పిందే వినాల‌ని అనుకునే ర‌కం. ఇక భార‌త జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే 20 మందిని ఎంపిక చేసినా బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ఓ ఫ్యాష‌న్ షో నిర్వ‌హించి, బ్యాట్ బాల్ ఇస్తే స‌రిపోతుంద‌ని ఎద్దేవా చేశాడు.

టీమిండియాలో తుది జ‌ట్టులో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా శుభ్ మ‌న్ గిల్ , విరాట్ కోహ్లీ, ఇషాన్ కిష‌న్ , సూర్య కుమార్ యాద‌వ్ , హార్దిక్ పాండ్యా , వాషింగ్ట‌న్ సుంద‌ర్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాద‌వ్ , మ‌హ్మ‌ద్ సిరాజ్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

Also Read : ఐసీసీ పురుషుల టీ20 టీమ్ ఇదే

Leave A Reply

Your Email Id will not be published!