BJP Survey Result : ఎన్నికలొస్తే బీజేపీదే మళ్లీ అధికారం
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే
BJP Survey Result : మోదీ బీజేపీ హవా ఏ మాత్రం తగ్గలేదని తేల్చింది ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే సీ ఓవర్ నిర్వహించిన సర్వేలో. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేపట్టిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికప్పుడు గనుక దేశంలో సార్వత్రిక (లోక్ సభ ) ఎన్నికలు చేపడితే భారతీయ జనతా పార్టీకి ఏకంగా 284 సీట్లు వస్తాయని(BJP Survey Result) తేల్చి చెప్పింది.
ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏమాత్రం పని చేయదని పేర్కొంది. కొన్ని సీట్లు గతంలో కంటే కాంగ్రెస్ కు పెరుగుతాయని పేర్కొంది. ఆ పార్టీకి 52 సీట్ల నుంచి 68 సీట్లు వస్తాయని ఇక ఇతరులకు 191 సీట్లు రానున్నాయని అంచనా వేసింది. ఇక తెలంగాణలో సైతం బీజేపీకి సీట్లు పెరుగుతాయని వెల్లడించింది.
మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హవా మాత్రం మరింత పెరిగిందని తెలిపింది. ఆయన నాయకత్వ సమర్థతపై జనం పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టం చేసింది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోవిడ్ నిర్వహణ, ఆర్టికల్ 370 రద్దు, యూనిఫాం సివిల్ కోడ్ కు 69 శాతం మద్దతు తెలిపారని సర్వే(BJP Survey Result) పేర్కొంది.
విచిత్రం ఏమిటంటే బడుల్లో హిజాబ్ ను బ్యాన్ చేయాలని కోరుతున్న వారు 60 శాతం పైగా ఉండడం విస్తు పోయేలా చేసింది. మోడీ పనితీరు పట్ల 72 శాతం సంతోషంగా ఉన్నారని తెలిపింది.
Also Read : రాహుల్ యాత్రలో ఒమర్ అబ్దుల్లా