Congress Seeks : ‘అదానీ’ పై సెబీ, ఆర్బీఐ విచారించాలి

డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ

Congress Seeks : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ. అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. 36 పేజీల నివేదిక ను బ‌ట్ట బ‌య‌లు చేసింది. గ‌త రెండు ఏళ్ల నుంచి తాము పూర్తిగా ప‌రిశోధ‌న‌లు జ‌రిపామ‌ని, అదానీ గ్రూప్ వ‌న్నీ త‌ప్పుడు లెక్క‌లేనంటూ ఆరోపించింది.

దీంతో స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కు చెందిన షేర్లు ఒక్క‌సారిగా ప‌డి పోయాయి. దీంతో ఒక్క రోజులోనే దాదాపు రూ. 86 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది . దీనిపై సీరియ‌స్ గా స్పందించింది అదానీ గ్రూప్. అమెరికా కోర్టులో ప‌రువు న‌ష్టం వేస్తామ‌ని, కావాల‌ని హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ త‌మ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు య‌త్నించిందంటూ ఆరోపించింది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అదానీ గ్రూప్ పై యుఎస్ సంస్థ చేసిన ఆరోప‌ణ‌లపై , అక్ర‌మ లావాదేవీల‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టాల‌ని సెబీ, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ఇవాళ ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్(Congress Seeks)  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇది దేశ ఆర్థిక వ్య‌స్థ స్థిర‌త్వం, భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అదానీ గ్రూప్ సంస్థ‌కు, దాని చీఫ్ గౌత‌మ్ అదానీకి వ‌త్తాసు ప‌లుకుతున్న మోడీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు జైరామ్ ర‌మేష్‌.

Also Read : హిండెన్‌బర్గ్ పై అదానీ గ్రూప్ దావా

Leave A Reply

Your Email Id will not be published!