Raghav Chadha UK Award : చ‌ద్దాకు యుకే అచీవ‌ర్స్ అవార్డు

అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ

Raghav Chadha UK Award : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ఇండియా – యునైటెడ్ కింగ్ డ‌మ్ అత్యుత్త‌మ అచీవ‌ర్స్ అవార్డుకు ఎంపిక‌య్యారు. లండ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎంపీ రాఘ‌వ్ చద్దా ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. బ్రిటీష్ విశ్వ విద్యాల‌యాల‌లో చ‌దివిన భార‌తీయ విద్యార్థులు సాధించిన విజ‌యాల‌కు గుర్తుగా వీటిని అంద‌జేస్తారు.

ఈ సంద‌ర్బంగా ఈ అవార్డును ఆమ్ ఆద్మీ పార్టీకి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha). యుకె పార్ల‌మెంట్ తో క‌లిసి భార‌త్ 75 ఏళ్ల వేడుకుల‌ను జ‌రుపుకునే కార్య‌క్ర‌మాన్ని నేష‌న‌ల్ ఇండియ‌న్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియ‌న్ , బ్రిటీష్ కౌన్సిల్ , యుకే ప్ర‌భుత్వ అంత‌ర్జాతీయ వాణిజ్య విభాగం నిర్వ‌హించాయి.

అత్యున్న‌త సాధ‌కులు ఐదుగురిని ఎంపిక చేశాయి. ప్ర‌జాస్వామ్యం, న్యాయాన్ని ఎలా అనుభ‌విస్తారో మార్చ‌డంలో ప్ర‌జ‌లు, స‌వాలుగా ఉన్న సామాజిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్‌క‌రించ‌డంలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చినందుకు రాఘ‌వ్ చ‌ద్దాను(Raghav Chadha UK Award) ఎంపిక చేశారు. ప్ర‌భుత్వం , రాజ‌కీయాలు విభాగంలో అవార్డును అందుకున్నారు.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో చ‌దివారు చద్దా. ఆప్ లో చేర‌క ముందు రాఘ‌వ్ చ‌ద్దా లండ‌న్ లో ఓ సంస్థ‌ను నిర్వ‌హించారు. ఆప్ లో వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడిగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా 2022లో 33 ఏళ్ల వ‌య‌స్సులో రాఘ‌వ్ చ‌ద్దా పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న ఆ రాష్ట్రానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్నారు.

అత్యంత చిన్న వ‌య‌స్సులో పార్ల‌మెంట్ కు ఎన్నిక‌య్యాడు. గ్లోబ‌ల్ లీడ‌ర్ గా కూడా గుర్తింపు పొందారు. చ‌ద్దాకు వ‌రుస‌గా ఇది అంత‌ర్జాతీయ ప‌రంగా ల‌భించిన రెండో అతి పెద్ద అవార్డు.

Also Read : స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!