Chandramohan K Viswanath : చంద్రమోహ‌న్ కంట‌త‌డి

అన్న‌ద‌మ్ముల అనుబంధం

Chandramohan K Viswanath : క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ లేర‌న్న వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక పోతున్నాన‌ని వాపోయారు న‌టుడు చంద్ర‌మోహ‌న్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సిరి సిరి మువ్వ తెలుగు సినిమా రంగంలో అద్భుత విజ‌యాన్ని సాధించింది. చంద్ర‌మోహ‌న్ కు(Chandramohan) ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. ఇదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

త‌డి పెట్టారు. త‌న దుఖాఃన్ని ఆపు కోలేక పోయారు. జీవితంలో క‌ళాత‌ప‌స్విని కోల్పోవ‌డంతో త‌న‌లోంచి ఓ భాగాన్ని తీసి వేసిన‌ట్ల‌యింద‌ని వాపోయారు. ఆయ‌న మాట్లాడుతున్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నారు చంద్ర‌మోహ‌న్. నాకు పెద్ద‌న్న కె. విశ్వ‌నాథ్. నేను విశ్వ‌నాథ్, ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండే వార‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రిని కోల్పోయాన‌ని ఇక నేను మాత్రమే మిగిలి ఉన్నాన‌నంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు చంద్ర‌మోహ‌న్.

నేను ఎన్నో పాత్ర‌ల్లో న‌టించా. కానీ సిరి సిరి మువ్వ సినిమా నా లైఫ్ నే మార్చేసింద‌న్నారు న‌టుడు. ఒక ర‌కంగా ఇవాళ నా సోద‌రుడు లేకుండా నేను ఎలా బ‌తకాలి అంటూ వాపోయాడు(Chandramohan). బంధం తెగి పోయినా మాన‌సిక అనుబంధం త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉంటుంద‌న్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం క‌ళాత‌ప‌స్వి బ‌తికే ఉంటార‌ని చెప్పారు.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : క‌ళాత‌ప‌స్వికి మ‌ర‌ణం లేదు

Leave A Reply

Your Email Id will not be published!