K Viswanath Movies : కళాతపస్వి సినిమాలు కళాఖండాలు
సినీ వాకిట చెరగని సంతకం కె. విశ్వనాథ్
K Viswanath Movies : సినిమా జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. అంతకు మించి ప్రతిఫలించేలా చేస్తుంది. సినిమాకు ప్రాణం పోసేది దర్శకుడే. అందుకే అతడే అన్నింటికీ కర్త..కర్మ..క్రియ. సినీ వినీలాకాశంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న అరుదైన ఏకైక కళాత్మక దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్.
ఆయనకు 92 ఏళ్లు. జీవితంలో అన్నింటిని దగ్గరుండి చూశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టారు. మొదటగా సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా మీద ఉన్న మమకారం కె. విశ్వనాథ్ ను కళాత్మకమైన దర్శకుడిగా తీర్చి దిద్దేలా చేసింది.
ఆయన దర్శకుడే కాదు నటుడు, రచయిత కూడా. ప్రతి సినిమా ఓ కళా ఖండంగా ఉండేలా తీర్చిదిద్దాడు. ప్రతి సినిమా ఓ దృశ్య కావ్యం. సినిమా సక్సెస్ కావాలంటే స్టార్ హీరోలు, హీరోయిన్లు అవసరం లేదని నిరూపించారు కళాతపస్వి. ఎక్కడో అనామకుడైన సోమయాజులును తీసుకు వచ్చి హీరోగా చేసిన ఘనత ఆయనదే.
అదే శంకరా భరణం దేశాన్ని ఊపేసింది(K Viswanath Movies). జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చి పెట్టేలా చేసింది. సాగర సంగమం..సిరి వెన్నెల..ఇలా ప్రతి సినిమా అద్భుతం. జీవితపు అన్ని లోతులను తెరపై ఆవిష్కరించిన మహోన్నత దర్శకుడు. సాహిత్యం, సంగీతం పట్ల ఉన్న మక్కువ, ప్రేమ అతడిని ప్రత్యేకమైన దర్శకుడిగా తీర్చి దిద్దేలా చేసింది.
సప్తపది, స్వాతి ముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభ లేఖ, ఆపద్భాంధవుడు , శుభ సంకల్పం సాంఘిక అంశాలను ప్రస్తావించాయి. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు కె. విశ్వనాథ్. పలు సినిమాలలో కూడా నటించి మెప్పించారు.
సినిమా రంగానికి చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు. 1992 లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ, కళాతపస్వి బిరుదు దక్కింది కె. విశ్వనాథ్ కు.
చెన్నైలో సౌండ్ రికార్డిస్టుగా కెరీర్ ప్రారంభించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి చిత్రాలకు పని చేశారు.
కె. విశ్వనాథ్ లోని ప్రతిభను గుర్తించి ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారు అక్కనేని నాగేశ్వర్ రావు. అన్నమాట నిలబెట్టుకున్నారు. తానే హీరోగా నిర్మించిన ఆత్మ గౌరవం కు దర్శకుడి గా అవకాశం ఇచ్చారు.
అదే ఆయన తొలి సినిమా కె. విశ్వనాథ్ కు. ఈ చిత్రానికి నంది అవార్డు దక్కింది. చంద్రమోహన్ , జయప్రదతో సిరి సిరి మువ్వ తీశారు. అదే జయప్రదతో కమల్ హాసన్ తో కలిపి సాగర సంగమం తీశారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ హిట్ మూవీగా(K Viswanath Movies) నిలిచింది.
ఇది ఓ అద్బుత కళా ఖండంగా మిగలి పోయింది. శంకరా భరణం ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. సిరి వెన్నెల సినిమాకు సీతారామ శాస్త్రిని పరిచయం చేశారు కె. విశ్వనాథ్.
చివరకు ఆ సినిమానే తన పేరుగా మార్చేసుకునేలా చేశారు. సిరివెన్నెల, స్వర్ణ కమలం, స్వాతి కిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను చెప్పారు.
తెలుగు సినిమా చరిత్రను జాతీయ , అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేలా చేసింది శంకరా భరణం. పాశ్చాత్య సంగీతపు మాయలో కొట్టుకు పోతున్న భారతీయ సంప్రదాయం, సంగీతానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా ఉండాలని పరితపించారు.
దానినే సినిమాలో ప్రతిఫలించేలా చేశారు దర్శకుడు కె. విశ్వనాథ్. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను ప్రస్తావించారు. సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది.
స్వాతి ముత్యం 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. కె. విశ్వనాథ్ సినిమాలలో ప్రధానంగా సంగీతానికి ప్రయారిటీ. కేవీ మహదేవన్ , ఇళయరాజాలను ఎంచుకున్నారు.
కొన్ని సినిమాలలో పండిత్ హరి ప్రసాద్ చౌరాసియా, కేలూ చరణ్ మహా పాత్ర, షరోన్ లోవెన్ వంటి దిగ్గజ కళాకారులతో కలిసి పని చేశాడు.
Also Read : కళాతపస్వికి కన్నీటి నివాళి