Arun Kumar Jain : దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు
జీఎం అరుణ్ కుమార్ జైన్
Arun Kumar Jain : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు కేటాయించడం జరిగిందని వెల్లడించారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్(Arun Kumar Jain). ఒక్క దక్షిణ మధ్య రైల్వేకు రూ. 13,786.19 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో ఒక్క తెలంగాణ ప్రాంతానికి రూ. 4,418 కోట్లు చేర్చారని , గత ఏడాది తో పోలిస్తే 45 శాతం ఎక్కువని స్పష్టం చేశారు జీఎం.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో అరుణ్ కుమార్ జైన్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ , ఏపీకి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణలను తోసి పుచ్చారు.
ఎంఎంటీఎస్ ఫేజ్2కు బడ్జెట్ లో కేంద్రం ప్రయారిటీ ఇచ్చిందని రూ. 600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రం తన వాటా కేటాయించిందని, అయితే రాష్ట్రం తన వాటా కింద నిధులు కేటాయించాల్సి ఉందన్నారు అరుణ్ కుమార్ జైన్(Arun Kumar Jain). అంతే కాకుండా కాజీ పేట వర్క్ షాప్ కు రూ. 160 కోట్లు, చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు రూ. 82 కోట్లు , రోడ్ సేఫ్టీ పనులకు రూ. 1360 కోట్లు , స్టేషన్ అభివృద్దికి రూ. 215 కోట్లు , పుట్ ఓవర్ బ్రిడ్జీలు , ప్లాట్ ఫాం ల ఎత్తు పెంచేందుకు రూ. 53.43 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
Also Read : నిర్మలమ్మ ఎన్నికల బడ్జెట్