Amit Shah : జార్ఖండ్ సర్కార్ అవినీతికి కేరాఫ్ – షా
కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా
Amit Shah : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పై నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయన ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. శనివారం జార్ఖండ్ లో ప్రసంగించిన షా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పూర్తిగా అవినీతి పరుడు అంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. రాష్ట్రంలో గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని అక్రమార్కులు భూములు గుంజు కుంటున్నారని మండిపడ్డారు.
జార్ఖండ్ లో జనాభా మార్పు వల్ల ఆదివాసీ (గిరిజన ) జనాభా శాతం తగ్గుముఖం పట్టిందన్నారు అమిత్ షా(Amit Shah). ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ్ సంకల్ప్ మహా ర్యాలీ చేపట్టింది.అంతర్జాతీయ సరిహద్దుల నుండి భారీ చొరబాట్లు కారణంగా ఆదివాసీల జనాభా 35 శాతం నుండి 24 శాతానికి తగ్గిందన్నారు. వీరిని హేమంత్ సోరేన్ ప్రోత్సహించారని అమిత్ షా ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రభుత్వం ఇలాంటి చవకబారు చర్యలకు దిగిందన్నారు కేంద్ర మంత్రి. దేశంలోనే హేమంత్ సోరేన్ సర్కార్ అత్యంత అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. రైల్వే వ్యాగన్లు, ట్రాక్టర్లతో వనరులను కొల్ల గొడుతున్నారంటూ ఆరోపించారు అమిత్ షా. అభివృద్ది ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఇక ప్రజలు దీనిని దించడం ఖాయమన్నారు .
వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 14 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచు కోవడం ఖాయమన్నారు అమిత్ చంద్ర షా. హేమంత్ సోరేన్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు కేంద్ర హోం శాఖ మంత్రి.
Also Read : ప్రతి ఒక్కరితో కేంద్రం పేచీ – కేజ్రీవాల్