Magha Purnima 2023 : భ‌క్త‌జ‌నం గంగ‌లో పుణ్య స్నానం

మాఘ పూర్ణిమ సంద‌ర్భంగా

Magha Purnima 2023 : మాఘ పూర్ణిమ ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని దేశ వ్యాప్తంగా ఆల‌యాలు, ప‌విత్ర న‌దుల‌న్నీ కోట్లాది మంది భ‌క్తుల‌తో నిండి పోయాయి. భ‌క్త జ‌నం పుణ్య స్నానంలో పునీత‌మ‌య్యారు. మ‌రికొంద‌రు పూజ‌ల‌లో మునిగి పోయారు. ఇక మాఘ పూర్ణిమ‌ రోజున ప‌విత్రమైన న‌దుల‌లో స్నానం చేస్తే ముక్తి క‌లుగుతుంద‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం.

ఈ విశేష‌మైన దినం సంద‌ర్భంగా వార‌ణాసి లోని గంగా నదిలో ల‌క్ష‌లాది మంది భ‌క్తులు పుణ్య స్నానం చేశారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులే. ఈ సంద‌ర్భంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసింది. ఇటీవ‌ల క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌క్తులు పూజ‌లు చేసేందుకు, పుణ్య స్నానం చేసేందుకు పోటెత్తారు.

మాఘ పూర్ణిమ ప‌ర్వ‌దినాన్ని(Magha Purnima 2023) పుర‌స్క‌రించుకుని భ‌క్త బాంధ‌వుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్. ఇదిలా ఉండ‌గా హిందూ క్యాలెండ‌ర్ ప్ర‌కారం మాఘ మాసంలో పౌర్ణ‌మి రాత్రి మాఘ పూర్ణిమ సంద‌ర్భంగా ఆదివారం అర్ధ‌రాత్రి నుంచే భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. ఎక్క‌డ చూసినా భ‌క్తులే క‌నిపించారు.

ఇవాళ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని వార‌ణాసి లోని ప్ర‌యాగ్ ఘాట్ కు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. భ‌క్తుల‌తో పాటు సాధువులు, రుషులకు కూడా మాఘ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం యోగి ఆదిత్యానాథ్. గంగ‌లో పుణ్య స్నానం చేశారు. అనంత‌రం విష్ణుమూర్తికి ప్రార్థ‌న‌లు చేశారు. పౌష్ పూర్ణిమ నుండి ఒక నెల పాటు జ‌రుగుతుంది క‌ల్పవ‌స్ . ఇవాల్టితో ముగుస్తుంది.

Also Read : ఘ‌నంగా స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు

Leave A Reply

Your Email Id will not be published!