JD Lakshmi Narayana : బీఆర్ఎస్ లో చేరే ప్ర‌స‌క్తి లేదు – జేడీ

ఆ ప్ర‌చారం అంతా అబ‌ద్దం

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను త్వ‌ర‌లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్ ) పార్టీలో తాను చేరుతున్న‌ట్లు ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, ఇదంతా పూర్తి అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.

తాను ఏ పార్టీలో చేర‌న‌ని పేర్కొన్నారు. త‌న‌కంటూ ఓ ల‌క్ష్యం ఉంద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం త‌న ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు సీబీఐ మాజీ జేడీ. అయితే ఎన్నిక‌ల కంటే ముందు ఏ పార్టీలో చేరుతాన‌నేది ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌క‌టిస్తాన‌ని వెల్ల‌డించారు. తాను మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో త‌న‌కు బాగా తెలుస‌న్నారు ల‌క్ష్మీనారాయ‌ణ‌(JD Lakshmi Narayana).

విచిత్రం ఏమిటంటే మీడియా ప‌నిగ‌ట్టుకుని తాను ఈ పార్టీలో చేరుతున్నానంటూ ప్ర‌చారం చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీలో చేరారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఓట‌మి పాల‌య్యారు. అనంత‌రం జ‌న‌సేన పార్టీ నుంచి వైదొలిగారు.

ఇదిలా ఉండ‌గా చ‌ట్ట వ్య‌తిరేకంగా ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు భావిస్తే ఫిర్యాదు చేసి విచార‌ణ కోర‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో తాను విశాఖ ప‌ట్ట‌ణం నుంచే పోటీ చేస్తానని ప్ర‌క‌టించారు జేడీ(JD Lakshmi Narayana).

Also Read : తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!