JP Nadda Sringeri Mutt : శృంగేరి పీఠంలో జేపీ నడ్డా
పీఠాధిపతి విజయేంద్ర భారతి ఆశీస్సులు
JP Nadda Sringeri Mutt : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ పీఠంగా పేరొందిన శృంగేరీ పీఠాన్ని సందర్శించారు జేపీ నడ్డా(JP Nadda Sringeri Mutt).
ఇందులో భాగంగా జేపీ నడ్డా శృంగేరిలో బస చేశారు. జేపీ నడ్డా శారదాంబ దర్శనం చేసుకున్నారు. జగద్గురువుగా పేరొందారు విజయేంద్ర భారతి. దాదాపు ఆయనను కలిసేందుకు 20 నిమిషాల పాటు సమయం కోరారు. చివరకు స్వామి ఒప్పుకోవడంతో చివరకు జేపీ నడ్డా కోరిక నెరవేరింది.
ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. శృంగేరి మఠంపై దాడి చేసిన పీష్వా వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రంలో బీజేపీ సీఎం చేయబోతోందంటూ మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో శృంగేరిలో పర్యటించడం , జగత్ గురువులతో మాట్లాడడం విశేషం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై , బీజేపీ స్టేట్ చీఫ్ తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
విజయేంద్ర సరస్వతి భారతి గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోని శంకరాచార్య స్థాపించిన పీఠాలలో శృంగేరి కూడా ఒకటి. దీనికి పీఠాధిపతిగా ఉన్నారు విజయేంద్ర సరస్వతి భారతి. ఆయన ఆశీస్సుల కోసం వేలాది మంది వేచి ఉంటారు. ఎందుకంటే ఆయన ఆశీస్సులు మరింత బలాన్ని ఇస్తాయన్న నమ్మకం వారికి. ఇక్కడ భారతీయ ధర్మం, సంస్కృతి గురించి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు స్వామి వారు.
Also Read : యుద్దాన్ని ఆపిన ప్రధాని మోదీ – జేపీ నడ్డా