JP Nadda Ukraine War : యుద్దాన్ని ఆపిన ప్ర‌ధాని మోదీ – జేపీ న‌డ్డా

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు షాకింగ్ కామెంట్స్

JP Nadda Ukraine War : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ , ర‌ష్యా యుద్దాన్ని కేవ‌లం భార‌తీయ విద్యార్థుల‌ను ర‌క్షించేందుకు నిలిపి వేసిన ఘ‌న‌త ఒక్క దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి(PM Modi) మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నారు.

ప్ర‌ధాని అసాధార‌ణ నిర్ణ‌యం వ‌ల్ల , విదేశాంగ శాఖ చేసిన ప్ర‌య‌త్నం వ‌ల్ల ఉక్రెయిన్ లో 22,500 మంది విద్యార్థులు ప్రాణాలు పోకుండా భార‌త్ కు రాగ‌లిగార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు జేపీ న‌డ్డా(JP Nadda).

ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ పాల‌న సాగిస్తోంది. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఉడిపి త‌మ పార్టీకి ప్ర‌త్యేక స్థానాన్ని క‌లిగి ఉంద‌న్నారు జేపీ న‌డ్డా. బీజేపీకి ఇది ప్ర‌ధాన ముఖ ద్వారామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉడిపిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రిగిన యుద్దంలో అక్క‌డ చ‌దువుకునేందుకు వెళ్లిన విద్యార్థుల‌ను కాపాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

వార్ నుంచి పిల్ల‌ల‌ను తీసుకు వ‌చ్చిన ఏకైక ప్ర‌ధాన మంత్రి మోదీ ఒక్క‌డేన‌ని కొనియాడారు జేపీ న‌డ్డా(JP Nadda Ukraine War). భార‌త దేశ చ‌రిత్ర‌లో మోదీ త‌ప్ప ఇంకే ప్ర‌ధాని ఇలాంటి అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు బీజేపీ జాతీయ చీఫ్‌. యుఎస్ లో కేవ‌లం 76 శాతం మాత్ర‌మే కోవిడ్ నివార‌ణ‌కు వ్యాక్సిన్ మాత్ర‌మే వాడార‌ని కానీ భార‌త దేశంలో 100 శాతం పూర్తి చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు జేపీ న‌డ్డా.

Also Read : ప‌వ‌న్ ఖేరాపై అస్సాం సీఎం ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!