CM Shinde EC : ఈసీ నిర్ణ‌యం శిరోధార్యం – షిండే

రూల్స్ ప్ర‌కార‌మే ప్ర‌భుత్వం ఏర్పాటు

CM Shinde EC :  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎవ‌రి ప‌ట్లా వివ‌క్ష చూప‌దు. దానికి కూడా రూల్స్ ఉన్నాయి. అది కూడా దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు స్వయం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌. దాని గురించి తాము ఎలాంటి కామెంట్స్ చేయ‌లేద‌న్నారు మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే.

శివ‌సేన పార్టీకి సంబంధించిన విల్లు..బాణం గుర్తును షిండే వ‌ర్గానికి కేటాయించింది. దీనిని స‌వాల్ చేస్తూ శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే శిబిరం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఎమ్మెల్యేల అనర్హ‌త వేటుకు సంబంధించి కోర్టులో విచ‌రాణ జ‌రుగుతోంది.

అంత‌లోనే ఎందుకు ఈసీ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు షిండే, ఈసీల‌కు నోటీసు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా సీరియ‌స్ గా స్పందించారు సీఎం షిండే(CM Shinde EC). కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒక‌రు చెబితే వింటుంద‌ని అనుకోవడం భ్రమ‌. పూర్వ ప‌రాలు చూస్తుంది. అన్నింటిని ప‌రిశీలించిన త‌ర్వాతే నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తుంద‌ని అన్నారు. అది తెలుసుకోకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఉద్ద‌వ్ ఠాక్రే , సంజ‌య్ రౌత్ కు అల‌వాటుగా మారిందంటూ ఎద్దేవా చేశారు.

ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ బీజేపీకి వ్య‌తిరేకంగా చేసిన దావాపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు షిండే. ఎన్నిక‌ల సంఘం మెరిట్ ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకునే స్వ‌తంత్ర సంస్థ‌. రూల్స్ ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని..త‌మ‌కు ఢోకా లేద‌న్నారు సీఎం షిండే(CM Shinde EC).

శివ‌సేన పేరు , గుర్తు పై ఈసీ నిర్ణ‌యం తీసుకునేలా కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఒత్తిడి తెచ్చింద‌ని ప‌వార్ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని అన్నారు.

Also Read : జావేద్ అక్త‌ర్ కు సంజ‌య్ స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!