IND vs AUS 3rd Test : 109 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

ఆసిస్ బౌల‌ర్ల దెబ్బ‌కు విల‌విల

IND vs AUS Day 1 3rd Test : ఇండోర్ వేదిక‌గా ప్రారంభ‌మైన మూడో టెస్టు తొలి రోజు మ‌ధ్యాహ్నం లోపే భార‌త జ‌ట్టు పేక‌మేడ‌లా కూలి పోయింది. కేవ‌లం 109 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త బ్యాట‌ర్లు ఎక్క‌డా ధీటుగా ఎదుర్కొన్న పాపాన పోలేదు.

పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పేరుతో కేఎల్ రాహుల్ ను ప‌క్క‌న పెట్టినా ఫ‌లితం లేక పోయింది. అత‌డి స్థానంలో శుభ్ మ‌న్ గిల్ సైతం నిరాశ ప‌రిచాడు. ఆట ప్రారంభం నుంచే ఆసిస్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. ఒకానొక ద‌శ‌లో బంతుల్ని ఎదుర్కొనేందుకు నానా తంటాలు ప‌డ్డారు బ్యాట‌ర్లు.

ఇప్ప‌టికే భార‌త్ నాగ్ పూర్ , ఢిల్లీలో జ‌రిగిన తొలి, రెండో టెస్టులో టీమిండియా గెలుపొంద‌గా మూడో మ్యాచ్ ఇవాళ ప్రారంభ‌మైంది. మొద‌ట టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ అంచ‌నా త‌ప్పింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై(IND vs AUS Day 1 3rd Test) భారీ స్కోర్ చేసి స‌త్తా చాటాల‌ని అనుకున్నాడు.

కానీ ఆసిస్ బౌల‌ర్లు ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వ‌లేదు ప‌రుగులు చేసేందుకు. ఆదుకుంటాడ‌ని భావించిన విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక పోయారు. రోహిత్ శ‌ర్మ 12 ర‌న్స్ చేస్తే శుభ్ మ‌న్ గిల్ 21 ర‌న్స్ చేశారు. ఆసిస్ బౌల‌ర్ కుహ్నేమాన్ దెబ్బ‌కు ట‌పా ట‌పా వికెట్లు రాలాయి.

ఛ‌తేశ్వ‌ర్ పుజారాను ఒక్క ప‌రుగుకే వెన‌క్కి పంపించాడు నాథ‌న్ లియోన్ . ర‌వీంద్ర జ‌డేజా 4 ర‌న్స్ చేస్తే , శ్రేయ‌స్ అయ్య‌ర్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ స్థానంలో ఉమేష్ యాద‌వ్ ను తీసుకున్నారు. కేఎల్ రాహుల్ ను త‌ప్పించి గిల్ కు అవ‌కాశం ఇచ్చింది బీసీసీఐ.

Also Read : రూ. 7 కోట్లు ఇస్తే వ‌స్తా లేదంటే బై బై

Leave A Reply

Your Email Id will not be published!